ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్: ఫైనల్లో మంజురాణి ఓటమి

హైదరాబాద్: రష్యా వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ మహిళా బాక్సర్ మంజురాణి ఓటమిపాలైంది. 48 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో రష్యా బాక్సర్ ఎకతెరిన పాల్సివ చేతిలో మంజురాణి 4-1తేడాతో ఓడిపోయింది.
దీంతో మంజురాణి వెండి పతకంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన చతామత్ రక్‌సాత్‌ను 4-1తో ఓడించి తొలిసారి మంజురాణి ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రవేశించింది. ఈ క్రమంలో ఈ ఛాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల వయస్సులోనే ఫైనల్స్‌లో ప్రవేశించిన మొదటి మహిళగా మంజురాణి రికార్డు సృష్టించింది.
కాగా, శనివారం జరిగిన సెమీఫైనల్లో మేరీకోమ్ 51 కేజీల విభాగంలో, జమున 54 కేజీల విభాగంలో, లోవ్లినా 69 కేజీల విభాగాల్లో ఓడిపోయారు. దీంతో వీరు కాంస్య పతకాలతో సరి పెట్టుకున్నారు.
Story first published: Sunday, October 13, 2019, 14:59 [IST]
Other articles published on Oct 13, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications