Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డబ్ల్యూబీఎఫ్ టైటిల్‌ నెగ్గిన మన్‌దీప్‌

భారత ప్రొఫెషనల్‌ బాక్సర్‌ మన్‌దీప్‌ జాంగ్రా ప్రపంచ వేదికపై విజేతగా నిలిచాడు. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (డబ్ల్యూబీఎఫ్) నిర్వహించిన వరల్డ్ సూపర్ ఫెదర్ వెయిట్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. 31 ఏళ్ల ఈ హర్యానా స్టార్ తన పంచ్‌లతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఫైనల్‌లో బ్రిటన్ బాక్సర్ కానర్‌ మెకంతోష్‌‌ను మట్టికరిపించాడు.

టైటిల్ పోరు ఆరంభం నుంచి పవర్‌ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థిపై మనదీప్ విరుచుకుపడ్డాడు. పది రౌండ్లలో ఏ రౌండ్‌లోనూ బ్రిటన్ బాక్సర్‌కు అవకాశమే ఇవ్వలేదు. మన్‌దీప్‌ ధాటికి మెకంతోష్ ప్రతిఘటించలేకపోయాడు. కాగా, ఈ క్రమంలో మన్‌దీప్ అమెచ్యూర్‌ సర్క్యూట్‌లో 11వ విజయాన్ని అందుకున్నాడు. అతను 12 సార్లు బరిలోకి దిగగా ఒక్కసారి మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచాడు.

Mandeep Jangra Claims World Boxing Federation Super Featherweight Title

మాజీ ఒలింపిక్‌ రజత పతక విజేత రాయ్‌ జోన్స్‌ దగ్గర మన్‌దీప్ శిక్షణ తీసుకుంటున్నాడు. 31 ఏళ్ల మన్‌దీప్ 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో రజత పతకం సాధించాడు. కాగా, డబ్ల్యూబీఎఫ్ టైటిల్ నెగ్గిన అనంతరం మన్‌దీప్ మాట్లాడాడు. తన కెరీర్‌లో అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటి అని పేర్కొన్నాడు. కోచ్ రాయ్ జోన్స్‌, అసిస్టెంట్ కోచ్ అసా బీర్డ్, ఏంజెల్‌లకు ధన్యవాధాలు చెప్పాడు.

ఎన్నోఏళ్ల పాటు కఠోర శ్రమకు దక్కిన ప్రతిఫలం ఇది అని మన్‌దీప్ అన్నాడు. ఈ టైటిల్ దేశ ప్రతిష్ట‌ను మరింత పెంచుతుందని తెలిపాడు. అలాగే బాక్సర్లు ప్రొఫెషనల్ బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి ఇది ప్రేరణ కలిగిస్తుందని పేర్కొన్నాడు. మన్‌దీప్ జాంగ్రా 2021లో ప్రొఫెషనల్‌ కెరీర్‌ ఆరంభించాడు.

Story first published: Wednesday, November 6, 2024, 14:50 [IST]
Other articles published on Nov 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+