మేడమ్.. నేను పతకం సాధించాను: సుష్మ కోరిక నెరవేర్చిన బాక్సర్

హైదరాబాద్: 15 ఏళ్ల భారత జూనియర్ బాక్సర్ జలక్ తోమర్... కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కోరికను నెరవేర్చింది. ఉక్రెయిన్‌లో జరిగిన వలెరియా దెమ్యనోవా స్మారక అంతర్జాతీయ టోర్నీలో జలక్ తోమర్ రజత పతకంతో సాధించింది.
వివరాల్లోకి వెళితే... జూనియర్ నేషనల్ చాంపియన్ జలక్ తోమర్.. ఉక్రెయిన్‌లో వలేరియా దెమ్యనోవా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీకి భారత జట్టుకు ఎంపికైంది. అయితే టోర్నీకి వెళ్లే సమయానికి ఆమెకు పాస్‌పోర్టు రాలేదు. దీంతో ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లింది.
ఆమె వెంటనే స్పందించి తోమర్‌కు పాస్‌పోర్టు వచ్చేలా సాయం చేశారు. అంతేకాదు టోర్నీలో పతకం తీసుకురావాలని జలక్ తోమర్‌ను సుష్మా కోరింది. శనివారం ముగిసిన ఈ టోర్నీలో 54 కిలోల విభాగంలో తోమర్ రజత పతకం కైవసం చేసుకుంది.
ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం నాలుగు స్వర్ణపతకాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం దక్కింది. ఇప్పుడు తోమర్ పతకం సాధించడంతో సుష్మా తన ట్విట్టర్ ద్వారా ఆమెతో పాటు మిగతా విజేతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications