Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విషాదం: తలపై పంచ్‌లు‌...స్టేజ్‌పైనే ప్రాణాలు కోల్పోయిన భారత సంతతి బాక్సర్

సింగపూర్: సింగపూర్ సెలబ్రిటీ బాక్సింగ్ పోటీలో విషాదం చోటు చేసుకుంది. కిక్ బాక్సింగ్ బౌట్‌లో పాల్గొన్న భారత సంతతికి చెందిన ప్రదీప్ సుబ్రహ్మణ్యన్ గుండెపోటుతో మరణించాడు. పోటీ ముగిసిన కాసేపటికే ఆయన కుప్పకూలిపోయాడు.

దీంతో ఆయనను హుటాహుటిగా ఆసుప్రత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రదీప్ ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి డాక్టర్లు తెలిపారు. ఆయన మృతిపై బాక్సింగ్ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Indian-Origin Bodybuilder, 32, Dies An Hour After First Kick-Boxing Match

స్టీవెన్‌లిమ్‌తో జరిగిన పోటీలో ప్రదీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తలపై పంచ్‌లు పడ్డాయి.
గేమ్ మొదలైన ఐదు నిమిషాలకే ప్రదీప్ ముక్కులో నుంచి రక్తం కారడంతో రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేశాడు. లిమ్‌ను విజేతగా ప్రకటించాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే ప్రదీప్ కుప్పకూలిపోయాడు.

అందరూ చూస్తుండగానే బాక్సర్ ప్రదీప్ ప్రాణాలు కోల్పోవడం అక్కడున్న వారిని షాక్‌కు గురిచేసింది. ప్రదీప్ సుబ్రహ్మణ్యన్ వరల్డ్ బాడీబిల్టింగ్ ఫిజిక్ క్రీడా సమైక్య సింగపూర్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు.

Story first published: Wednesday, November 15, 2017, 12:40 [IST]
Other articles published on Nov 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+