Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌లో మరో రెండు స్వర్ణాలు.. మొత్తంగా 9 పతకాలు!!

Indian Boxers Bags 9 Medals in Boxing World Cup

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో వచ్చిన విరామం తర్వాత పాల్గొన్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు సత్తాచాటారు. జర్మనీలోని కొలోన్‌ పట్టణంలో ముగిసిన ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. మెగా టోర్నీలో భారత బాక్సర్లు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు గెల్చుకున్నారు. చివరి రోజు పోటీలో మహిళా బాక్సర్లు సిమ్రన్‌జీత్‌ కౌర్‌ (60 కేజీలు), మనీషా‌ (57 కేజీలు) పసడి పతకాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఈ టోర్నీలో భారత్‌ ఖాతాలో మొత్తం 9 పతకాలు చేరినైట్లెంది.

ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో మనీషా‌ 3-2 తేడాతో సాస్కిపై గెలువగా.. సిమ్రన్‌జీత్‌ 4-1 తేడాతో మయ క్లియెన్‌హాస్‌ (జర్మనీ)పై విజయం సాధించింది. ఫైనల్‌ ఫైట్‌లో సిమ్రన్‌జీత్‌ ఎదురు లేకుండా దూసుకెళ్లి.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పంచ్‌ల వర్షం కురిపిస్తే.. మనిశ్‌ మాత్రం హోరాహోరీ పోరులో పైచేయి సాధించి పసిడి ఖాయం చేసుకుంది. శనివారం పురుషుల ఫైనల్లో అమిత్‌ పంగాల్‌ (52 కేజీలు) స్వర్ణం సాధించగా.. సతీశ్‌ కుమార్‌ (+91 కేజీలు) రజతం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Indian Boxers Bags 9 Medals in Boxing World Cup

మొదటగా 91 కేజీల విభాగంలో సతీశ్‌ కుమార్‌ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఫైనల్లో సతీశ్‌ తన ప్రత్యర్థి నెల్వీ టియాఫాక్‌ (జర్మనీ)కి వాకోవర్‌ ఇచ్చాడు. సెమీఫైనల్లో ఓడిన సోనియా (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), గౌరవ్‌ (57 కేజీలు), హుసాముద్దీన్‌ (57 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. దీంతో మొత్తం మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో భారత్‌.. రెండో స్థానంతో టోర్నీని ముగించింది.

జర్మనీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్‌తో పాటు బెల్జియం, క్రొయేషియా, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, మోల్దోవా, నెదర్లాండ్స్‌, పొలాండ్‌, ఉక్రెయిన్‌ బాక్సర్లు పాల్గొన్నారు. కరోనా వైరస్‌తో వచ్చిన విరామం తర్వాత ఈ టోర్నీ జరగడంతో బాక్సర్లు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని టోర్నీలు జరగాలని వారు ఆశించారు.

Story first published: Monday, December 21, 2020, 8:00 [IST]
Other articles published on Dec 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+