‘నరేంద్ర.. ఆ పేరు వింటేనే అసహ్యం’.. పాక్ బాక్సర్ కామెంట్‌తో ప్రధాని నవ్వులు!
కామన్వెల్త్ గేమ్స్ 2026లో రజత పతకం సాధించిన భారత బాక్సర్ నరేందర్ బెర్వాల్ ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన, హాస్యభరితమైన సంఘటనను పంచుకున్నారు. ప్రధాని నివాసంలో క్రీడాకారులతో జరిగిన ముఖాముఖి సంభాషణలో నరేందర్ బెర్వాల్ 2015 ప్రపంచ మిలిటరీ గేమ్స్ నాటి ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆయన చెప్పిన స్టోరీ విని ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారిగా బిగ్గరగా నవ్వేశారు.
నరేందర్ బెర్వాల్ ఆ స్టోరీని చెబుతూ.. 2015 ప్రపంచ మిలిటరీ గేమ్స్‌లో తన మొదటి బౌట్ పాకిస్తాన్ బాక్సర్‌తో జరిగిందని చెప్పారు. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. "ఏదైనా జరగనివ్వండి.. కానీ పాకిస్తాన్ ఆటగాడి చేతిలో మాత్రం ఓడిపోకూడదు" అని తమ సైనిక ఉన్నతాధికారుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని ఆయన వెల్లడించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో నరేందర్ బెర్వాల్ అద్భుతంగా రాణించి పాకిస్తాన్ బాక్సర్‌ను ఓడించారు.

అయితే ఆ హోరాహోరీ పోరులో ఇద్దరు బాక్సర్ల ముఖాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం కుట్లు వేయించుకోవడానికి ఇద్దరూ కలిసి ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో పాకిస్తాన్ బాక్సర్ నరేందర్ బెర్వాల్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు "2014లో నరేంద్ర మోదీ మొదటిసారి భారత ప్రధాని అయ్యారు. మా ఆర్మీ కోచ్ పేరు కూడా నరేంద్ర రాణా. ఆ పాకిస్తాన్ బాక్సర్ కాసేపు ఆలోచించి..'భాయ్, నేను ఓ మాట చెప్పనా? నీ పేరు నరేందర్, నీ కోచ్ పేరు నరేంద్ర, మీ ప్రధాని పేరు కూడా నరేంద్ర.. నాకు ఈ నరేంద్ర అనే పేరు వింటేనే అసహ్యం వేస్తోంది' అని సరదాగా అన్నాడు" అని నరేందర్ బెర్వాల్ వెల్లడించారు. ఈ పంచ్ వినగానే ప్రధాని నరేంద్ర మోదీ పక్కున నవ్వేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలతో వ్యక్తిగతంగా మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడల ఖ్యాతిని పెంచడంలో వారు చేసిన కృషిని.. చూపిన ప్రతిభను ప్రధాని మోదీ ఎంతో అభినందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

