Amit Panghal: వరల్డ్ నంబర్ బాక్సర్‌కు బిగ్ షాక్: నాకౌట్‌లోనే వెనక్కి
టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో తొమ్మిదో రోజు భారత్ మిశ్రమ ఫలితాలను సాధించింది. పురుషుల లైట్ వెయిట్ బాక్సింగ్‌లో నాకౌట్ రౌండ్‌లోనే వెనుదిరిగింది. అదే సమయంలో మహిళల డిస్కస్ థ్రోలో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ కేటగిరీలో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కమల్ ప్రీత్ కౌర్.. ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఈ కేటగిరీలో ఆమె 64 మీటర్ల దూరం పాటు డిస్కస్‌ను విసిరి రెండో స్థానంలో నిలిచారు.

పరాజయాల పలకరింపు
అదే సమయంలో మహిళల డిస్కస్ థ్రో కేటగిరీలోనే మరో పరాజయం భారత్‌ను పలకరించింది. క్వాలిఫికేషన్స్ గ్రూప్ ఏలో పోటీ పడిన వెటరన్ అథ్లెట్ సీమా పునియ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఆరోస్థానంతో సరిపెట్టుకున్నారు. అనూహ్య ఓటమితో తన పతకాల వేటను ప్రారంభించింది. అర్చరీలో మెరుపులు మెరిపించి, పతకంపై ఎన్నో ఆశలు రేకెత్తించిన స్టార్ అర్చర్ అతాను దాస్.. వెనుదిరిగాడు. అత్యంత సంక్లిష్టమైన 1/8 గండాన్ని దాటుకోలేకపోయాడు. 1/16లో కఠినమైన ప్రత్యర్థిపై పైచేయి సాధించిన అతాను.. చివరి రౌండ్‌లో ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. వెంట్రుకవాసిలో పరాజయాన్ని చవి చూశాడు.

బాక్సింగ్‌లో నాకౌట్‌లోనే..
ఇక బాక్సింగ్‌లోనూ భారత్‌కు చుక్కెదురైంది. వరల్డ్ నంబర్ వన్ బాక్సర్, భారత్‌కు చెందిన అమిత్ ఫంగల్ నాకౌట్ రౌండ్‌లో వెనుదిరిగాడు. తన ప్రత్యర్థి కొలంబియాకు చెందిన యుబెర్జెన్ మార్టినెజ్ రివాస్ చేతిలో 4-1 తేడాతో ఓడిపోయాడు. పురుషుల 48-52 కేజీల లైట్ వెయిట్ కేటగిరీలో నాకౌట్ దశలోనే అతని ప్రస్థానం ఆగిపోయింది. మార్టినెజ్ అల్లాటప్పా బాక్సర్ కాదు. 2016 నాటి రియో ఆ సెట్‌ను గెలుచుకున్నప్పటికీ.. అదే దూకుడును కొనసాగించలేకపోయాడు. చేతులెల్తే శాడు.

డిఫెన్సివ్ గేమ్..
కొన్ని మెరుపు హుక్స్‌ను అతను సంధించినప్పటికీ.. టార్గెట్‌ను చేరలేకపోయాయవి. అదే సమయంలో మార్టినెజ్ ఎదురుదాడికి దిగాడు. దీనితో అమిత్ డిఫెన్సివ్ గేమ్ ఆడాడు. రక్షణాత్మక స్థితికి చేరాడు. అదే అతని పరాజయానికి దారి తీసింది. ఏ దశలో కూడా కౌంటర్ అటాక్‌కు దిగలేకపోయాడు అమిత్. తొలి సెట్‌ను కోల్పోయిన తరువాత మార్టినెజ్ దెబ్బతిన్న పులిలా కనిపించాడు. అగ్రెసివ్ గేమ్ ఆడాడు. పంచ్‌లతో తన ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. చివరి రెండు రౌండ్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

పురుషుల బాక్సింగ్‌లో బ్యాడ్‌టైమ్..
పురుషుల బాక్సింగ్ విభాగంలో నలుగురు ప్రాతనిథ్యాన్ని వహించినప్పటికీ.. సతీష్ కుమార్ మినహా మరెవరూ విజయాన్ని అందుకోలేకపోయారు. అదే సమయంలో మహిళల బాక్సింగ్‌లో భారత్‌కు రజత పతకం ఖాయమైంది. అస్సాంకు చెందిన లవ్లీనా బొర్గొహెయిన్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఆమెకు రజత పతకం ఖాయమైంది. సెమీస్, ఆ తరువాత ఫైనల్స్‌ను గెలవగలిగితే భారత చిరకాల స్వప్నం నెరవేరుతుంది. స్వర్ణాన్ని ముద్దాడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications