Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరుస పంచ్‌ల దాడి.. ప్రాణాలు కోల్పోయిన బాక్సర్

Four days after suffering a brain injury Russian boxer Maxim Dadashev dies


వాషింగ్టన్‌: ప్రత్యర్థి సుబ్రియేల్‌ మాటియాస్‌ చేతిలో చావు దెబ్బలు తిని గాయాలతో చికిత్స పొందుతున్న రష్యన్‌ బాక్సర్‌ మాగ్జిమ్‌ దాదాషేవ్‌ అమెరికా ఆసుపత్రిలో మంగళవారం మృతి చెందాడు. మేరీల్యాండ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన 140-పౌండ్ల అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రపంచ టైటిల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాగ్జిమ్‌ దాదాషేవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

ప్రత్యర్థి సుబ్రియేల్‌ మాటియాస్‌ వరుస పంచ్‌ల ధాటికి మాగ్జిమ్‌ దాదాషేవ్‌ కుప్పకూలిపోయాడు. వెంటనే మాగ్జిమ్‌ ట్రైనర్‌ అతని ఓటమిని తెలియజేశాడు. అనంతరం రింగులోనే అతనితో మాట్లాడానికి ప్రయత్నించినా.. సరిగా స్పందించలేదు. మరోవైపు గాయాల తీవ్రత అధికంగా ఉండటంతో వెంటనే ఎంజిఎం నేషనల్ హార్బర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. నాలుగు రోజులు చికిత్స అనంతరం మాగ్జిమ్‌ మంగళవారం మరణించాడని బాక్సింగ్ ఫెడరేషన్ తెలిపింది. మ్యాచ్‌లో మాగ్జిమ్‌ తలకు బలమైన గాయం కావడంతోనే అతను మరణించాడని తెలుస్తోంది.

రష్యా బాక్సింగ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ఉమర్ క్రెమ్లెవ్ మాట్లాడుతూ... 'మాగ్జిమ్‌ మరణానికి ఎవరైనా తప్పు చేశారా అని ఫెడరేషన్ సమాఖ్య దర్యాప్తు చేస్తుంది. అసలు ఏమి జరిగిందనే దాని గురించి మేము నిజం తెలుసుకోవాలి. కొన్ని మానవ తప్పిదాల (ఆటలో) కారణంగా మాగ్జిమ్‌ చనిపోయాడని నమ్ముతున్నా. మాగ్జిమ్‌ కుటుంబానికి అండగా ఉంటాం' అని తెలిపారు.

రష్యాలో జన్మించిన 28 ఏళ్ల రష్యన్‌ బాక్సర్‌ మాగ్జిమ్‌ అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. మాగ్జిమ్‌ బరిలోకి దిగిన 14 మ్యాచుల్లో 13 విజయాలు సాధించాడు. గత శుక్రవారం రాత్రి జరిగిన తన చివరి మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయాడు. ఆ మ్యాచే మాగ్జిమ్‌కు ఆఖరిది.

Story first published: Wednesday, July 24, 2019, 17:30 [IST]
Other articles published on Jul 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+