Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ వల్లే స్వర్ణం గెలిచాను: సాక్షి చౌదరి

స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు అదరగొట్టారు. బాక్సింగ్ భారత్ ఏడు స్వర్ణాలతో సహా 10 పతకాలను సాధించింది. స్వర్ణ పతక విజేతలలో సాక్షి చౌదరి కూడా ఉన్నారు. ఆమె మహిళల 51 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకున్నారు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత తన ప్రయాణంలో విరాట్ కోహ్లీ పోషించిన కీలక పాత్రకు సాక్షి కృతజ్ఞతలు తెలిపారు.

వైభవ్‌ సూర్యవంశీని వదిలేయండి.. ఇప్పుడే టెస్ట్ క్రికెట్ ఆడించొద్దు: అజింక్యా రహానే

వైభవ్‌ సూర్యవంశీని వదిలేయండి.. ఇప్పుడే టెస్ట్ క్రికెట్ ఆడించొద్దు: అజింక్యా రహానే

హర్యానాలోని భివానీలో మాట్లాడుతూ సాక్షి చౌదరి ఇలా అన్నారు, "విజేందర్ సింగ్‌ను చూసి నేను బాక్సింగ్ ప్రారంభించాను. నా ఈ ప్రయాణంలో విరాట్ కోహ్లీ కూడా నాకు గొప్ప మద్దతుగా నిలిచారు. ఆయనే నా స్పాన్సర్. ఆయనకు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను." అని సాక్షి పేర్కొన్నారు. కోహ్లీ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, మానసికంగా కూడా తనను ప్రోత్సహించాడని ఆమె వివరించింది.ఒత్తిడికి దూరంగా ఉండి, కేవలం తన ప్రదర్శనపైనే దృష్టి పెట్టమని విరాట్ ఎల్లప్పుడూ సలహా ఇచ్చేవాడని ఆమె తెలిపారు.

Commonwealth Games 2026 Sakshi Chaudhary Credits Virat Kohli After Winning Boxing Gold Details

గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 51 కేజీల విభాగం ఫైనల్‌లో సాక్షి ఇంగ్లాండ్‌కు చెందిన రూబీ వైట్‌ను 5-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమెకు ఇదే మొదటి పతకం. 2022లో గాయం కారణంగా ఆమె గేమ్స్‌లో పాల్గొనలేకపోయింది. 2025లో ఆమె వరల్డ్ బాక్సింగ్ కప్‌లో 54 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది . ఈ ఏడాది ప్రారంభంలో, సాక్షి 54 కేజీల విభాగం నుండి 51 కేజీల విభాగానికి మారాలని నిర్ణయించుకుంది. అది ఒక సాహసోపేతమైన నిర్ణయమే అయినా, సాక్షి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

IND vs SL వామప్ మ్యాచ్‌.. తేలిపోయిన భారత బౌలర్లు!

Also Read

IND vs SL వామప్ మ్యాచ్‌.. తేలిపోయిన భారత బౌలర్లు!

51 కేజీల జాతీయ ట్రయల్స్‌లో, ఆమె 2022 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత నిఖత్ జరీన్, 2025 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ స్వర్ణ పతక విజేత మీనాక్షి హూడాలను ఓడించి కామన్వెల్త్ గేమ్స్ కోసం భారత జట్టులో స్థానం సంపాదించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో సాక్షి చౌదరి నాలుగు బౌట్‌లలో ఆడి, ఆ నాలుగింటిలోనూ 5-0 తేడాతో ఏకపక్ష విజయాలు సాధించింది.

Story first published: Friday, August 7, 2026, 18:41 [IST]
Other articles published on Aug 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+