CWG 2026: ఏది ఏమైనా తగ్గేదే లే.. 102 డిగ్రీల జ్వరంతోనూ కామన్వెల్త్ స్వర్ణం!
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భాగంగా బాక్సింగ్‌లో భారత్ 7 స్వర్ణాలతో సహా మొత్తం 10 పతకాలను గెలుచుకుంది. ఫైనల్స్ అన్నీ శనివారం జరిగాయి. 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి భారత్‌కు స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన చాంటెల్ రీడ్‌పై అరుంధతి చౌదరి 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొదటి రౌండ్‌లో 5 మంది న్యాయనిర్ణేతలలో 4 మంది అరుంధతికి 10-10 పాయింట్లు ఇచ్చారు. దీని అనంతరం ఆమె తర్వాతి రౌండ్‌లో న్యాయనిర్ణేతలందరినీ ఆకట్టుకుని 10-10 పాయింట్లు సాధించింది. మూడో రౌండ్లో కూడా న్యాయనిర్ణేతలందరూ అరుంధతికి అనుకూలంగానే తీర్పు ఇచ్చారు.
అరుంధతికి 102 డిగ్రీల జ్వరం
జ్వరంతో బాధపడుతూనే అరుంధతి చౌదరి దేశానికి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ఆమె అక్క చారు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. "మేము ఎంత సంతోషంగా ఉన్నామో మీరే చూడవచ్చు. మా ఆనందాన్ని దాచుకోలేకపోతున్నాం. ఈ రోజు నా సోదరిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. 102 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ ఆమె కామన్వెల్త్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది" అని అరుంధతి సోదరి చారు తెలిపారు.

బాక్సింగ్‌లో ఇండియాకు స్వర్ణ పతకాలు సాధించిన ఏడుగురు బాక్సర్లలో ఆరుగురు హర్యానాకు చెందినవారు. విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటా నగరానికి చెందినది అరుంధతి చౌదరి ఇండియాకు స్వర్ణం సాధించిపెట్టారు. ఆమె మొదట బాక్సింగ్ చేయాలని నిర్ణయించుకున్న సమయంలో ఆమెకు శిక్షణ ఇవ్వడానికి ఆ నగరంలో ఒక్క బాక్సింగ్ కోచ్ కూడా లేరు. 23 ఏళ్ల అరుంధతి చౌదరి గతంలో బాస్కెట్ బాల్ ఆడేది. ఆమె 15 ఏళ్ల వయసులో బాక్సింగ్ నేర్చుకోవడం ప్రారంభించింది.
చదువుకోవాలని కోరుకున్న అరుంధతి తండ్రి
అరుంధతి చౌదరి తండ్రి సురేష్ చౌదరి ఆమె చదువుపై దృష్టి సారించాలని కోరుకున్నారు. కోటాలో విద్యారంగం ఎంతో వృద్ధి చెందిన సంగతి అందరికీ తెలిసిన విషయమేనని.. అరుంధతి కూడా ఎంతో తెలివైన అమ్మాయి అని సురేష్ చౌదరి పేర్కొన్నారు. ముఖ్యంగా గణితంలో ఆమెకు చాలా ప్రతిభ ఉందని ఆయన చెప్పారు. అరుంధతి ఐఐటీ పరీక్ష రాయాలని లేదా ఐఏఎస్ అధికారి కావడానికి చదవాలని నేను తనతో చెప్పానని.. ఆమె రెండింటిలో ఏదో ఒకటి సాధిస్తుందని నాకు నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు.
అప్పుడు ఐఏఎస్, ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో ఎంత మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని ఆమె నన్ను అడిగినట్లు అరుంధతి తండ్రి సురేష్ తెలిపారు. ఐఏఎస్‌లో సుమారు 200 మంది, ఐఐటీలో సుమారు 10,000 మంది ఉత్తీర్ణులవుతారని తనకు చెప్పానన్నారు. అప్పుడు ఆమె నన్ను.. 'నాన్నా, ఎంత మంది భారతీయులు ఒలింపిక్ బంగారు పతకాలు గెలుచుకున్నారు?' అని అడిగిందని.. . ఆ సమయంలో నాకు అభినవ్ బింద్రా గురించి మాత్రమే తెలుసన్నారు. ఆమెకు ఈ విషయం చెప్పినప్పుడు అలా చేసిన మొదటి భారతీయ మహిళగా నిలవాలని కోరుకుంటున్నానని చెప్పిందంటూ సురేష్ చౌదరి పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

