Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాక్సింగ్ ప్రపంచకప్: మీనా కుమారికి స్వర్ణం

Cologne Boxing World Cup: Meena Kumari bags 54kg gold medal

కొలోన్‌ బాక్సింగ్‌ ప్రపంచకప్‌ 2019లో భారత బాక్సర్లు అదరగొట్టారు. భారత బాక్సర్‌ మైస్నమ్‌ మీనా కుమారి (54 కేజీలు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఈ టోర్నిలో భారత్‌ మొత్తం 5 (1స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలు సాధించింది.

శనివారం జరిగిన మహిళల 54కిలోల బౌట్ ఫైనల్లో మచాయ్‌ బున్‌యానట్‌ (థాయ్‌లాండ్‌)పై మీనా గెలిచింది. హోరాహోరీగా సాగినా.. చివరకు పాయింట్ల ఆధారంగా మీనా విజేతగా నిలిచింది. 54కిలోల బౌట్ విభాగంలో పోటీదార్లు తక్కువగా ఉండటంతో.. నేరుగా ఫైనల్ చేరి మీనా టైటిల్ గెలిచింది. ఆసియా చాంపియన్‌షిప్ (2014) కాంస్య విజేతగా నిలిచిన మీనా.. తాజాగా జరిగిన స్ట్రాంజా కప్‌లోనూ స్వర్ణ పతకం సాధించింది.

ఇక ఈ టోర్నీలో ఇప్పటికే సాక్షి (57 కేజీలు), బసుమతరి (64 కేజీలు) రజత పతకాలు సాధించగా.. పింకీ రాణి (51 కేజీలు), పర్వీన్‌ (60 కేజీలు) కాంస్యాలు దక్కించుకున్నారు. మాచై బంయనుట్‌పై మీనా కుమారి విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది.

Story first published: Sunday, April 14, 2019, 11:05 [IST]
Other articles published on Apr 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+