Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ టైటిల్ కోసం: విజేందర్‌ తర్వాతి బౌట్‌ ఏప్రిల్‌లో!

Boxing: Vijender Singh eyes third belt on Pro Circuit, Commonwealth Games in April

హైదరాబాద్: ప్రో బాక్సింగ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఓటమన్నదే లేకుండా అజేయంగా దూసుకెళ్తున్న భారత స్టార్‌ బాక్సర్ విజేందర్‌ సింగ్‌ తన తర్వాతి బౌట్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆడనున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విజయేందర్ సింగ్ ప్రస్తుతం తన లక్ష్యం కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పుకొచ్చాడు.

'నా తదుపరి బౌట్‌ను ఏప్రిల్-మే నెలలో ప్లాన్ చేస్తున్నాం. అయితే దీనిపై స్పష్టత లేదు. ఈ సీజన్‌లో కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్నా కాబట్టిన కొంచెం సమయం పట్టొచ్చు. అక్కడ వెళ్లి విజయం సాధించడం అంత సులభం కాదు. ఈ బౌట్‌ను లండన్‌లో ప్లాన్ చేస్తున్నాం' అని ఓ అవార్డుల కార్యక్రమానికి హాజరైన విజేందర్‌ తెలిపాడు.

ఇప్పటికే డబ్ల్యూబీవో, ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌వెయిట్‌ చాంపియన్‌ టైటిళ్లను నెగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్‌ బౌట్‌ తర్వాత వరల్డ్‌ టైటిల్‌పై గురి పెట్టనున్నాడు. ఈ వరల్డ్‌ బౌట్‌ ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశముందని విజేందర్‌ సోమవారం తెలిపాడు.

'ప్రస్తుతం నా వద్ద రెండు బెల్ట్‌లు ఉన్నాయి. మూడో దాని కోసం ఫైట్ చేయాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి వరల్డ్ టైటిల్‌ కోసం పోటీ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం నా ర్యాంక్ ఆరు లేదా ఏడుగా ఉంది కాబట్టి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న వ్యక్తికి ఛాలెంజ్ విసరొచ్చు. వరల్డ్ టైటిల్‌లో పాల్గొనడానికి ముందు మరో టైటిల్ సాధించాలి' అని అన్నాడు.

Story first published: Tuesday, February 27, 2018, 16:56 [IST]
Other articles published on Feb 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+