23న 10వ ఫైట్: పింక్ సిటీ జైపూర్‌ని ఎంపిక చేసిన బాక్సర్ విజేందర్

హైదరాబాద్: ప్రొఫెనల్ బాక్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత ఓటమి ఎరుగని విజేందర్ సింగ్ తన తర్వాతి బౌట్‌ను ప్రకటించాడు. డిసెంబర్ 23న జైపూర్‌లో ఘనా బాక్సర్ ఎర్నెస్ట్ అమూజుతో తలపడనున్నట్టు తెలిపాడు. ఈ మేరకు విజేందర్ అధికారిక ప్రకటన చేశాడు.

విజేందర్ ప్రొఫెషనల్‌గా మారినప్పటి నుంచి ఇప్పటివరకు వరుసగా 9 విజయాలను సొంతం చేసుకున్నాడు. చివరగా గతేడాది ఆగస్టులో జరిగిన ఫైట్‌లో చైనా బాక్సర్ జుల్పికర్ మైమైటియాలిని ఓడించి డబ్ల్యూటీవో ఓరియంటల్ టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
విజేందర్ 10వ ఫైట్ పవర్ పుల్‌గా సాగే అవకాశం ఉంది. ఈ బౌట్ కోసం డబ్ల్యూబీవో ఓరియంటల్, ఆసియా పసిఫిక్ మిడిల్‌వెయిట్ టైటిళ్లను పణంగా పెట్టనున్నట్టు విజేందర్ చెప్పాడు. 'పింక్ సిటీ జైపూర్‌లో నా 10వ ఫైట్‌కు సిద్ధమవడం సంతోషంగా ఉంది. రింగ్‌లోకి దూకేందుకు గత రెండు నెలలుగా ఎంతో కష్టపడుతున్నా. వరుసగా పదో విజయం కూడా సాధిస్తాననే నమ్మకం ఉంది' అని విజేందర్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications