
హైదరాబాద్: భారత బాక్సింగ్ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ మరో అంతర్జాతీయ పతకాన్ని ఖాయం చేసుకుంది. బల్గేరియా వేదికగా జరుగుతోన్న 69వ స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో మేరీకోమ్ సెమీఫైనల్లో ప్రవేశించింది. ఈ టోర్నీలో 48వ కేజీల విభాగంలో మేరీ కోమ్ తలపడింది.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రొమేనియాకు చెందిన స్టెలుతా డుతాను ఓడించి సెమీస్ ఫైనల్లో చోటు దక్కించుకుంది. స్టెలుతా డుతా మీద గెలిచే గతంలో మూడుసార్లు (2006, 08, 10) మేరీ కోమ్ ప్రపంచ ఛాంపియన్ అయింది. ఈ బౌట్లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడినప్పటికీ, చివరకు మేరీ కోమే విజయం సాధించింది.
ఇటీవల ముగిసిన ఆసియా చాంపియన్‌షిప్‌తో పాటు ఇండియన్ ఓపెన్ టైటిళ్లను దక్కించుకున్న మేరీ కోమ్ ఇక్కడ కూడా సత్తా చాటింది. ఈ టోర్నీలో 60 కేజీల విభాగంలో సరితా దేవి క్వార్టర్స్‌లో ఘన విజయంతో సెమీస్ చేరుకుంది.
క్వార్టర్స్‌లో సరితా దేవి... ఖి యెవెన్ (చైనా)ను చిత్తు చేసింది.
ఇక, పురుషుల విభాగంలో అమిత్ (49 కేజీలు), హుసాముద్దీన్ (56 కేజీలు) కూడా సెమీస్‌లో ప్రవేశించారు. ఇప్పటికే సీమ పునియా (81 కేజీల పైన), స్వీటీ (75 కేజీలు), మీనా కుమారి (54 కేజీలు) భాగ్యభతి కచారి (81 కేజీలు) సెమీస్ చేరి పతకాలు ఖరారు చేసుకున్నారు.