Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజేందర్‌ ఎముకలు విరిచేస్తా: ఆఫ్రికన్‌ ఛాంపియన్‌ బాక్సర్ అముజు

 I will leave Vijender Singh beaten and broken, says Ernest Amuzu

హైదరాబాద్: భారత స్టార్ బాక్సర్ విజేందర్‌ సింగ్‌ను ఓడిస్తానని అతని ఎముకలు విరిచేస్తానని ఆఫ్రికన్‌ ఛాంపియన్‌ ఎర్నెస్ట్‌ అముజు వ్యాఖ్యానించాడు. డిసెంబర్‌ 23న జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఇండోర్‌ స్టేడియంలో వీరిద్దరికీ బిగ్‌ బౌట్ జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎర్నెస్ట్‌ అముజు శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. 'విజేందర్‌తో బౌట్ కోసం రోజుకు 8-10 గంటలు సాధన చేస్తున్నా. రింగ్‌లోకి అతను ఎలాంటి టెక్నిక్‌తో వచ్చినా సరే నేను సులభంగా కనిపెడతా. ఇంతకుముందు అతన్నెప్పుడూ చూడలేదు. సొంత ప్రేక్షకుల ముందే విజేందర్‌కు తొలి ఓటమి రుచి చూపించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని అన్నాడు.

'అతని శరీరాన్ని చిత్తుచేసి కుడిచేతిని వీపుపై వంచి నాకౌట్‌ చేస్తా. 23న మీరు చూస్తూ ఉండండి. అతని కన్నా నాకు ఎక్కువ అనుభవం ఉంది. విజేందర్‌ ఒలింపిక్‌ పతకం తెచ్చాడని తెలుసుకున్నా. అయితే ఆఫ్రికన్‌ టోర్నీలను నేను చాలా గెలిచా. విజేందర్‌ ఇక్కడ హీరో. మీ హీరోను ఓడించి తీరుతా. అతడి ఎముకలు విరిచేస్తా' అని అన్నాడు.

ఇదిలా ఉంటే విజేందర్ ఇప్పటివరకు వరుసగా తొమ్మిది బౌట్లు గెలిచాడు. విజేందర్‌ ఖాతాలో డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్‌, ఓరియెంటల్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిళ్లు ఉన్నాయి. ఇక అముజుకు కూడా బాక్సింగ్ అనుభవం ఎక్కువగానే ఉంది. 25 సార్లు పోటీపడగా 23 విజయాలు సాధించాడు. అందులో 21 నాకౌట్లే కావడం విశేషం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 15, 2017, 23:00 [IST]
Other articles published on Dec 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+