నాతో తలపడు.. బాక్సర్ విజేందర్‌కు సవాల్

భారత బాక్సర్ విజేందర్ సింగ్‌కు సహచర బాక్సర్లు నీరజ్ గోయత్, వికాస్ కృష్ణన్‌లు సవాల్ విసిరారు. మేము పిల్లలం కాదు.. పోరుకు మాతో సిద్ధమా అని సవాల్ చేశారు. ఒకే దేశానికి సంబందించిన బాక్సర్లు ప్రత్యర్థిని ఓడించేందుకు కసరత్తులు చేయాలి కానీ.. ఇలా సవాల్ విసురుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?. విషయంలోకి వెళితే.

పిల్లలతో ఫైటింగ్ చేయడం మానేయాలి:
తాజాగా న్యూజెర్సీలో జరిగిన బౌట్‌లో అమెరికా బాక్సర్ మైక్ స్నిడెర్‌ను విజేందర్ చిత్తు చేసాడు. దీంతో విజేందర్ ప్రొఫెషనల్‌గా వరుసగా 11వ విజయం సాధించాడు. అనంతరం విజేందర్ మాట్లాడుతూ...'బ్రిటిష్ బాక్సర్ ఆమిర్ ఖాన్‌ను ఢీకొట్టేందుకు నేను ఎప్పుడూ సిద్ధం. కానీ అతడే పిల్లలతో తలపడాలనుకుంటున్నాడు. ఆమిర్ పోటీకి జూనియర్ బాక్సర్‌ను ఎంచుకున్నాడు. నీరజ్ గోయత్ నాకన్నా చాలా జూనియర్. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఆమిర్ ఖాన్‌ను ఢీకొనేందుకు ఎప్పుడైనా రెడీ. తేల్చాల్సింది అతడే. ఆమిర్ పిల్లలతో ఫైటింగ్ చేయడం మానేయాలి' అని అన్నాడు.
తలపడేందుకు సిద్ధమా:
విజేందర్ చేసిన వ్యాఖ్యలు నీరజ్‌తో పాటు బాక్సర్ వికాస్ కృష్ణన్‌ను గాయపరిచాయి 'విజేందర్ నన్ను పిల్లాడు అన్నాడు. ప్రపంచ చాంపియన్‌ను సొంత దేశంలో ఓడించిన ఒకే ఒక్క భారత బాక్సర్ నేను. ఈ నవంబర్‌లో నాతో పాటు బాక్సర్ వికాస్ కృష్ణన్, ఆమిర్‌తో తలపడాలని సవాల్ చేస్తున్నా. మీరు సిద్ధమా' అని నీరజ్ ట్వీట్ చేశాడు.
రింగులోనే తేల్చుకుందాం:
మరోవైపు నీరజ్‌కు మద్దతుగా వికా స్ కూడా ట్విటర్‌లో విజేందర్‌కు సవాల్ విసిరాడు. 'విజేందర్, నీరజ్, ఆమిర్ ఒకే విభాగంలో ఉన్నారు. నీరజ్ అన్నట్టు మనమంతా నవంబర్‌లో బరిలోకి దిగొచ్చు. ఇక రింగులోనే తేల్చుకుందాం' అని వికాస్ ట్వీటు పెట్టాడు. బాక్సర్ ఆమిర్ ఖాన్‌తో డబ్ల్యూబీసీ పెర్ల్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ తలపడాల్సి ఉంది. అతడికి కారు ప్రమాదం జరగడంతో ఆ పోటీ వాయిదా పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications