బాక్సింగ్ - ఇక నుంచి 13 కాదు 10 మాత్రమే!
ప్రపంచ బాక్సింగ్ (డబ్ల్యూబీ) మార్గ దర్శకాల మేరకు.. కొత్త వెయిట్ కేటగిరీ (బరువులు)లను భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా ప్రారంభమైన జాతీయ ఛాంపియన్ షిప్‌లో ఈ కొత్త కేటగిరీలతోనే పోటీలను నిర్వహిస్తోంది.
గతంలో ఉన్న 13 వెయిట్ కేటగిరీలను పదింటికి కుదిస్తూ ప్రపంచ బాక్సింగ్ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రారంభమైన జాతీయ పురుషుల టోర్నీలో 10 బరువు విభాగాలతో పోటీలను నిర్వహిస్తున్నారు.

పురుషుల విభాగంలో 50 కేజీలు (ఫ్లై వెయిట్), 55 కేజీలు (బాంటమ్ వెయిట్), 60 కేజీలు (లైట్ వెయిట్), 65 కేజీలు (వెల్టర్ వెయిట్), 70 కేజీలు (లైట్ మిడిల్ వెయిట్), 75 కేజీలు (మిడిల్ వెయిట్), 80 కేజీలు (లైట్ హెవీ వెయిట్), 85 కేజీలు (క్రూజర్ వెయిట్), 90 కేజీలు (హెవీ వెయిట్), ప్లస్ 90 కేజీలు (సూపర్ హెవీ వెయిట్) ఈ కొత్త బరువు విభాగాల్ని నిర్ణయించారు.
మహిళల విభాగంలో 48 కేజీలు, 51 కేజీలు, 54 కేజీలు, 57 కేజీలు, 60 కేజీలు, 65 కేజీలు, 70 కేజీలు, 75 కేజీలు, 80 కేజీలు, ప్లస్ 81 కేజీల విభాగాల్లో పోటీలు ఉంటాయి. కాగా, వీటిలో ఆరు... 55, 60, 65, 70, 80, 90 కేజీల విభాగాలను ఒలింపిక్ కేటగిరీలుగా పేర్కొన్నారు.
ఇకపోతే అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) గుర్తింపు కోల్పోయిన తర్వాత గత ఎప్రిల్‌లో ప్రపంచ బాక్సింగ్ కొత్తగా మొదలైంది. ఇప్పటికే 60 మంది సభ్యుల మద్దతు కూడగట్టిన ప్రపంచ బాక్సింగ్.. ఐవోసీ గుర్తింపు కోసం ఎదురు చూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications