Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్వర్ణ పతకంతో భారత్‌కు వినేశ్ ఫోగాట్: ఎయిర్‌పోర్ట్‌లోనే నిశ్చితార్థం

Asian Games gold medalist Vinesh Phogat gets engaged at airport

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత స్టార్‌ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ నిశ్చితార్థం చేసుకుంది. గత వారం పోట్లీలో భాగంగా 50 కేజీల ప్రీస్ట్రైల్ రెజ్లింగ్ విభాగంలో పోటీ పడిన వినేశ్‌ ఫోగాట్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆసియాడ్‌లో స్వర్ణం నెగ్గిన తొలి మహిళా రెజ్లర్‌గా వినేశ్ చరిత్ర సృష్టించింది.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

ఆసియా గేమ్స్ జరుగుతున్న ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి వినేశ్ ఫోగాట్ శనివారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు ఘన స్వాగతం పలికారు. అదే రోజు, ఎయిర్‌పోర్టులో అభిమానుల సమక్షంలో వినేశ్‌ తన బాయ్‌ఫ్రెండ్‌, మాజీ రెజ్లర్‌ సోమ్‌వీర్‌ రాతితో నిశ్చితార్థం చేసుకుంది.

ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లోనే రింగులు మార్చుకున్నారు. వీళ్లిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో ఎంగేజ్‌మెంట్ రింగులు మార్చుకున్న సమయంలో వినేశ్ పెదనాన్న మహావీర్ ఫొగాట్, సోమ్‌వీర్ తల్లి అక్కడే ఉన్నారు. అదే రోజు వినేశ్ తన 24వ పుట్టిన రోజు కూడా జరుపుకోవడం విశేషం. సోమ్‌వీర్ రాఠి కూడా మాజీ జాతీయ స్థాయి రెజ్లర్. ఏడేళ్లుగా ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు.

నిజానికి శనివారం ఆమె బర్త్ డే కావడంతో అదే రోజు ఎంగేజ్‌మెంట్ జరుపుకోవాలని సోమ్‌వీర్ భావించాడు. అయితే ఆమె ఎయిర్‌పోర్ట్ చేరుకునేసరికి రాత్రి కావడంతో సోమ్‌వీర్ అక్కడే ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగాడని బంధువులు తెలిపారు.

"వినేశ్‌ తిరిగి భారత్‌ చేరుకున్న అనంతరం ఆమె పుట్టిన రోజు వేడుకల్లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకోవాలనుకున్నారు. అయితే, విమానం ఆలస్యంగా రావడంతో వినేశ్‌ వచ్చే సరికి అర్ధరాత్రి అయింది. దీంతో విమానాశ్రయంలోనే వీరు ఉంగరాలు మార్చుకున్నారు" అని బంధువులు తెలిపారు.

Story first published: Tuesday, August 28, 2018, 14:06 [IST]
Other articles published on Aug 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+