For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫైనల్‌కు వికాస్‌, సిమ్రన్‌.. మేరీ, అమిత్‌కు కాంస్యాలు!!

Asian boxing qualifiers: Vikas Krishan enters final after sealing Tokyo Olympics berth

అమ్మాన్‌ (జోర్డాన్‌): ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో భారత అగ్రశ్రేణి బాక్సర్లు వికాస్‌ కృష్ణన్‌ (69కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60కేజీలు) తుది పోరుకు దూసుకెళ్లారు. మరోవైపు సెమీస్‌లో ఓడిన దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ (51కేజీలు), ప్రపంచ అగ్రర్యాంకర్‌ అమిత్‌ పంగల్‌ (52కేజీలు), ఆశీష్‌ కుమార్‌ (75 కేజీలు), లవ్లీనా (69కేజీలు), పూజా రాణి (75కేజీలు) కాంస్యాలతో సరిపెట్టుకున్నారు.

మంగళవారం జరిగిన పురుషుల సెమీస్‌లో కజికిస్థాన్‌ బాక్సర్‌, రెండు సార్లు ప్రపంచ కాంస్య పతక విజేత అబ్లైఖాన్‌ జుస్సుపోవ్‌పై 3-2 తేడాతో వికాస్‌ ఆకట్టుకొనే విజయం సాధించాడు. ఫైనల్‌కు దూసుకెళ్లి కనీసం రజతం ఖాయం చేశాడు. వికాస్‌ కృష్ణన్‌ తన తర్వాత బౌట్లో కఠిన ప్రత్యర్థి జోర్డానియన్‌ ఇసయ్య హుస్సేన్‌తో తలపడనున్నాడు. అతడు గాయపడ్డప్పటికీ అద్భుతంగా పోరాడటం గమనార్హం.

మహిళల సెమీస్‌లో సిమ్రన్‌ 4-1తేడాతో షియూ వూ (తైవాన్‌)పై గెలువగా.. మేరీ 1-4తేడాతో చాంగ్‌ యున్‌ (చైనా) చేతిలో ఓడింది. సెమీస్‌ చేరుకోవడంతోనే అమిత్‌, లవ్లీనా, వికాస్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ నంబర్‌ వన్‌ అమిత్‌ పంగాల్‌ 2-3 తేడాతో జియాగువన్‌ హు (చైనా) చేతిలో ఓడి నిరాశపరిచాడు. గతేడాది జియాగువన్‌ను ఆసియా సెమీఫైనల్లో అమిత్‌ ఓడించడం గమనార్హం. అంతకుముందు హాంగ్‌గు (చైనా) చేతిలో లవ్లీనా 0-5 తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.

ఇక ఒలింపిక్‌ బెర్త్‌ రేసులో ఉన్న సచిన్‌ కుమార్‌ (81 కిలోలు) తొలి పోటీలో వియత్నాం బాక్సర్‌ ఎన్‌గుయెన్‌పై 4-1 తేడాతో విజయం సాధించాడు. చివరి పోటీలో షాబ్బస్‌ నెగ్‌మతుల్లోవ్‌ (తజికిస్థాన్‌)తో తలపడనున్నాడు. అందులో గెలిస్తే టోక్యోకు అర్హత సంపాదిస్తాడు. ఆశీష్‌ కుమార్‌ (75 కిలోలు), సతీశ్‌ కుమార్‌ (+91 కిలోలు), పూజారాణి (75 కిలోలు) టోక్యో ఒలింపిక్స్‌కు గతంలోనే అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, March 11, 2020, 8:28 [IST]
Other articles published on Mar 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+