Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రింగులో గాయాలు.. మరో బాక్సర్‌ మృతి

Argentine boxer Hugo Santillan was die from injuries sustained in a fight

బ్యూనస్‌ ఎయిర్స్‌: రింగ్‌లో ప్రత్యర్థి పిడుగుద్దులతో తీవ్రంగా గాయపడి మరణించిన రష్యా బాక్సర్‌ మాక్సిమ్‌ డడ్‌షెవ్‌ ఘటన మరవక ముందే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. అర్జెంటీనా బాక్సర్‌ హ్యూగో శాంటీలియన్‌ (23) కూడా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

గత శనివారం డబ్ల్యూబీసీ లాటినో సిల్వర్‌ లైట్‌వెయిట్‌ టైటిల్‌ కోసం ఉరేగ్వే బాక్సర్‌ ఎడ్వర్డో అబ్రెతో.. సాంతిల్లాన్‌ తలపడ్డాడు. 10వ రౌండ్‌ తర్వాత మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. డ్రాగా ముగిసిన ఈ బౌట్‌ ఫలితం వెలువరించే సమయంలో శాంటీలియన్‌ ఒక్కసారిగా రింగులోనే కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో సర్జరీ చేశారు. అయితే అది విఫలం కావడంతో గుండు పోటుకు గురైన సాంతిల్లాన్‌ గురువారం మరణించాడు.

2015లో ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారిన సాంతిల్లాన్‌ ఇప్పటి వరకూ 19 విజయాలు సాధించాడు. ఈ విజయాల్లో 8 నాకౌట్‌ విజయాలు కాగా.. రెండు డ్రాగా ముగిశాయి. 2016 సెప్టెంబర్‌లో దక్షిణ అమెరికా సూపర్‌ ఫెదర్‌వెయిట్‌ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో సాంతిల్లాన్‌ పేరు ప్రపంచానికి తెలిసింది. సాంతిల్లాన్‌ మృతిపై వరల్డ్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాంతిల్లాన్‌ గాయాలు పాలై మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొంది.

ప్రత్యర్థి సుబ్రియేల్‌ మాటియాస్‌ చేతిలో చావు దెబ్బలు తిని గాయాలతో చికిత్స పొందుతూ రష్యన్‌ బాక్సర్‌ మాగ్జిమ్‌ డడ్‌షెవ్‌ అమెరికా ఆసుపత్రిలో మృతి చెందాడు. మేరీల్యాండ్‌లో జరిగిన 140-పౌండ్ల అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రపంచ టైటిల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సుబ్రియేల్‌ మాటియాస్‌ వరుస పంచ్‌ల ధాటికి మాగ్జిమ్‌ దాదాషేవ్‌ కుప్పకూలిపోయాడు. వెంటనే మాగ్జిమ్‌ ట్రైనర్‌ అతని ఓటమిని తెలియజేశాడు. గాయాల తీవ్రత అధికంగా ఉండటంతో ఎంజిఎం నేషనల్ హార్బర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. నాలుగు రోజులు చికిత్స అనంతరం మాగ్జిమ్‌ మంగళవారం మరణించాడు.

Story first published: Saturday, July 27, 2019, 13:36 [IST]
Other articles published on Jul 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+