
హైదరాబాద్: స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన పదో ప్రోబౌట్‌ను ఆడనున్నాడు. ఈ మ్యాచ్ లో పాల్గొననున్న జాబితాలో మిగిలిన వారందరూ అత్యున్నత స్థాయి బాక్సర్లే. వాళ్లు కామన్ వెల్త్ ఛాంపియన్ షిప్ మాజీ ఆటగాళ్లు, పతక విజేతలు అయినటువంటి అమన్‌దీప్ సింగ్, సునీల్ సివాచ్ కూడా ప్రస్తుతం బాక్సర్ విజేందర్ సింగ్ తర్వాతే. కాగా విజేందర్ సింగ్‌కు ఎర్నెస్ట్ అముజూ కు డిసెంబరు 23 జైపూర్ లో జరగనుంది.
గురువారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన విజేందర్ తన కెరీర్ గురించి ఇలా మాట్లాడాడు.
ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాలనుకోవడం తన కెరీర్‌లోనే తీసుకున్న అతి కష్టమైన నిర్ణయమని వివరించాడు. 2013లో మత్తు పదార్థాలకు సంబంధించిన కేసులో తనపేరు బయటికి వచ్చిందని వాపోయాడు. అంతా మన మంచికే అన్నట్లు ఆ విషయాన్ని తీసుకున్నట్లు అభివర్ణించాడు.
ఇలాంటి వివాదాలు లేకుండా ఉంటే తానింత ధృడంగా ఉండేవాడిని కాదన్నాడు. వివాదాలే తనను రాటుదేల్చాయన్నాడు. విజేత కావాలంటే శారీరకంగానే కాదు. మానసికంగానూ ధృడంగా ఉండాలని తెలిపాడు.
ఈ పోటీల్లో తలపడనున్న మిగిలిన బాక్సర్లు అమన్ దీప్ (55 కేజీలు)తో మనోజ్ కుమార్ (పంజాబ్ )తో పోటీ పడాల్సి ఉంది. కుల్ దీప్ సింగ్ (93.4కేజీలు) తో అమరీందర్ సింగ్ (హర్యానా) తో తలపడాల్సి ఉంది. ఇంకొక కేటగిరి(61.2కేజీలు)లో అసద్ ఆసిఫ్ ఖాన్ (కోల్‌కత్తా)తో సునీల్ సివాచ్ తలపడనున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.