Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజేందర్ 'పవర్' పంచ్: కెరీర్‌లో వరుసగా పదో విజయం

Vijender defeats Amuzu by unanimous decision for 10th straight win

హైదరాబాద్: ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాక ఇప్పటి వరకు ఓటమంటూ ఎరుగని విజేందర్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఘనా బాక్సర్‌ ఎర్నెస్ట్‌ అముజుతో శనివారం జైపూర్ వేదికగా జరిగిన బౌట్‌లో విజేందర్‌ అద్భుత విజయాన్ని నమోదు చేశాడు.

Indian Boxer Vijender Wins 10th Successive Professional Bout

మూడు నిమిషాల నిడివిగల 10 రౌండ్ల బౌట్‌లో విజేందర్‌ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. తన పంచ్‌ పవర్‌ చూపించి ప్రత్యర్థిని మట్టికరిపించాడు. బౌట్‌ను పర్యవేక్షించిన ముగ్గురు న్యాయ నిర్ణేతలు విజేందర్‌కు 100 పాయింట్ల చొప్పున ఇవ్వగా... అముజుకు 90 పాయింట్లు మాత్రమే ఇచ్చారు.

ఈ విజయంతో 32 ఏళ్ల విజేందర్‌ డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌, డబ్ల్యూబీవో ఓరియెంటల్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిళ్లను నిలబెట్టుకున్నాడు. మొత్తం 10 రౌండ్లు పాటు సాగిన ఈ పోరులో ముగ్గురు న్యాయనిర్ణేతలూ విజేందర్‌కే ఎక్కువ పాయింట్లు ఇచ్చారు.

ఈ బౌట్‌కు ముందు విజేందర్‌ను ఓడించడంతో పాటు అతని ఎముకలు విరగ్గొడతానని ఛాలెంజ్‌ చేసిన 34 ఏళ్ల అముజుకు విజేందర్‌ తన పవర్ పంచ్‌లతో బెంబేలెత్తించాడు. తాజా విజయంతో విజేందర్‌ ఇప్పటి వరకు పది బౌట్లలో తలపడగా అన్నింటా విజయం సాధించాడు.

అందులో ఏడు నాకౌట్‌ విజయాలు ఉన్నాయి. ప్రత్యర్థి అముజు 25 బౌట్లలో తలపడగా 23 గెలుపొందాడు. అందులో 21 నాకౌట్‌ విజయాలే ఉన్నాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 24, 2017, 8:51 [IST]
Other articles published on Dec 24, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+