Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తైజు వద్ద భిన్నమైన షాట్లు: సెమీస్‌లో ఓటమిపై స్పందించిన సైనా

You need to have complete game to beat Tzu-Ying: Saina Nehwal

హైదరాబాద్: ప్రపంచ నంబర్‌ వన్‌ తైజుతో మ్యాచ్‌లో షాట్లు కొట్టడంలో, ర్యాలీలు ముగించడంలో నేనింకా వేగంగా చురుగ్గా స్పందించాలని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వెల్లడించింది. సోమవారం జరిగిన సెమీ ఫైనల్లో సైనా నెహ్వాల్‌ 17-21, 14-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్(చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలైంది.

ఈ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణికి తై జు యింగ్‌కు సైనా మధ్యలో గట్టి పోటీ ఇచ్చింది. ఇద్దరి మధ్య హోరాహోరిగా పోరు సాగింది. సైనా పాయింట్లు సమం చేస్తూ వీరోచితంగా పోరాడింది. అయితే, అనవసర తప్పిదాల కారణంగా సైనా మ్యాచ్‌ను చేజార్చుకోవల్సి వచ్చింది. 19 నిమిషాల హోరాహోరీగా సారిగి మొదటి గేమ్‌ను సైనా 17-21తో ఓడిపోయింది.

తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సైనా నెహ్వాల్.. రెండో గేమ్‌లో మాత్రం తన ప్రత్యర్ధికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇక, రెండో గేమ్‌ను ఓ దశలో 14-14తో సమం చేసింది. అయితే, ప్రత్యర్థి సైనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుసగా పాయింట్లు సాధిస్తూ తైజు యింగ్‌ 21-14తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

తొలిసారి ఫైనల్‌కు చేరే అవకాశం

తొలిసారి ఫైనల్‌కు చేరే అవకాశం

దీంతో వరుస రెండు గేమ్‌లతో పాటు మ్యాచ్‌ను చేజార్చుకుని ఆసియా గేమ్స్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. తైజు ఇంగ్‌ చేతిలో సైనా నెహ్వాల్ ఓడటం ఇది వరుసగా పదోసారి కావడం గమనార్హం. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ సెమీస్‌లో ఓటమి అనంతరం సైనా మీడియాతో మాట్లాడారు.

ర్యాలీలు ముగించడంలో నేనింకా వేగంగా

ర్యాలీలు ముగించడంలో నేనింకా వేగంగా

"తైజుతో మ్యాచ్‌లో షాట్లు కొట్టడంలో, ర్యాలీలు ముగించడంలో నేనింకా వేగంగా చురుగ్గా స్పందించాల్సింది. ఎక్కడో ఓ చోట ఆమె ప్రత్యర్థిని అందుకుంటుంది. ఆమెతో ప్రతి ర్యాలీ విభిన్నమే. చాలా మంది క్రీడాకారులకు ఒక ప్యాటర్న్‌ ఉంటుంది. కానీ తైజు వద్ద ఇంకా భిన్నమైన షాట్లు ఉన్నాయి. ఆమెను అర్థం చేసుకోలేపోతున్నా" అని తెలిపింది.

కోచ్‌లకు సైతం ఆమె కొరకరాని కొయ్య

కోచ్‌లకు సైతం ఆమె కొరకరాని కొయ్య

"కోచ్‌లకు సైతం ఆమె కొరకరాని కొయ్య. ఆమెను అర్థం చేసుకోవాలని ప్రయత్నించే లోపే సరికొత్త షాట్‌తో వచ్చేస్తోంది. సెమీస్‌లో నేను బాగానే ఆడా. ఆమె నా కన్నా ఎంతో మెరుగ్గా ఆడింది. ఆమెతో మ్యాచ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి" అని సైనా నెహ్వాల్ పేర్కొంది. సెమీస్‌లో తైజు ఇంగ్‌ను ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నించానని సైనా తెలిపారు.

ప్రత్యర్థి నాకన్నా బాగా ఆడటంతోనే ఓటమి

ప్రత్యర్థి నాకన్నా బాగా ఆడటంతోనే ఓటమి

అయితే, ప్రత్యర్థి తనకన్న బాగా ఆడటంతో ఓటమి తప్పలేదన్నారు. ఆసియా గేమ్స్‌ల్లో తొలిసారి పతకం గెలిచినందుకు ఆనందంగా ఉందని సైనా వెల్లడించింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన తనకు డ్రా కొంత మేలు చేసిందని సైనా తెలిపింది. ఆసియా గేమ్స్ ఒలింపిక్స్‌లాంటివే అని ఇక్కడ కరోలినా మారిన్‌ మాత్రమే ఉండదని సైనా పేర్కొంది. తైజుతో ఫైనల్లో సింధుకు 50-50 అవకాశాలు ఉన్నాయని సైనా చెప్పింది.

Story first published: Tuesday, August 28, 2018, 10:32 [IST]
Other articles published on Aug 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+