
హైదరాబాద్: డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ స్థాయి ఆటగాడు విక్టర్ అక్సెల్సన్ తన మెరుపు వేగంతో మళ్లీ విజయాన్ని చేజిక్కుంచుకున్నాడు. బెంగుళూరు బ్లాస్టర్స్ తరుపున ఆడుతున్న అక్సెల్సన్ ప్రత్యర్థిని గురువారం జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడించాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో బెంగుళూరు, ఢిల్లీ జట్ల మధ్య పురుషుల సింగిల్స్ మ్యాచ్ జరిగింది. ఇరు జట్లకు మొదటి మ్యాచ్ కావడంతో మొదట్లో సమాన స్థాయిలో దూసుకెళ్లారు. నిదానంగా అక్సెలెన్ పైచేయి చూపించడంతో బెంగుళూరు జట్టుకు విజయం దక్కింది.
ప్రపంచ స్థాయిలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న అక్సెలెన్ (డెన్మార్క్) బెంగుళూరు జట్టు తరపున దిగాడు. ప్రపంచస్థాయి నంబర్ 22వ ర్యాంకుతో కొనసాగుతన్న టిన్ హౌవాయ్ ఢిల్లీ డాషర్స్ జట్టు తరపున ఆడుతుండటంతో మ్యాచ్ మొదలైంది. సరిగ్గా గేమ్ సగం వచ్చే సరికి ఆటనంతా విక్టర్ అక్సెలెన్ తన చేతిలోకి తీసేసుకున్నాడు. ఇలా 5-2తేడాతో బెంగుళూరు జట్టు విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం అక్సెలెన్ మాట్టాడుతూ టిన్ మంచి ప్రతిభావంతమైన ఆటగాడు. గట్టి పోటీనిచ్చాడు. ఇటువంటి ప్రత్యర్థిపై గెలిచినందుకు నేను ఆనందపడుతున్నానని అభిప్రాయపడ్డాడు.
గురువారం వరకు జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు ఇలా ఉన్నాయి.
Mixed doubles: Sikki Reddy/Kim Sa Rang bt Ashwini Ponnappa/Vladimir Ivanov 15-10, 12-15, 15-11
Men's singles: Chong Wei Feng bt Vincent Wong Wing Ki 10-15, 15-13, 15-8
Women's singles: Sung JI Hyun bt Kirsty Gilmour 15-10, 8-15, 15-5
Men's singles: Viktor Axelsen bt Tian Houwei 15-11, 15-11
Men's doubles: Mathias Boe/Kim Sa Rang bt Vladmir Ivanov/Ivan Sozonov 15-9, 15-12
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.