ప్రధానిని కలిసిన పీవీ సింధు.. అభినందించిన మోడీ

ఢిల్లీ: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సోమవారం రాత్రి స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో సింధుకు ఘన స్వాగతం లభించింది. ఈ రోజు ఉదయం సింధు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్ గోపీచంద్‌లను ప్రధాని అభినందించారు. మోడీ.. సింధు మెడలో పతకం వేసి సత్కరించారు.
సింధు ఓ ఛాంపియన్:
ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా మోడీ ఓ పోస్ట్ చేశారు. 'భారతదేశం గర్వంగా ఉంది. స్వర్ణ పతకం సాధించి భారతదేశం కీర్తిని మరింత పెంచిన సింధు ఓ ఛాంపియన్ .ఆమెను కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి విజయాలు మరిన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా' అని మోడీ రాసుకొచ్చారు. సింధు, గోపీచందర్ సాయంత్రం వరకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

కిరణ్ రిజిజును కలిసిన సింధు:
అంతకుముందు ఢిల్లీ విమానాశ్రయంలో సింధు మాట్లాడుతూ... 'దేశానికి మరిన్ని మెడల్స్ అందిస్తా. అభిమానుల అందరికి ధన్యవాదాలు. దేశంలోని ప్రజల అందరి ఆశీస్సులు, ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు' సింధు తెలిపింది. అనంతరం మంగళవారం ఉదయం సింధు, కోచ్ గోపీచంద్ కలిసి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజును కలిశారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన సింధును రిజిజు అభినందించారు.

సింధు చరిత్ర:
ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (బీడబ్ల్యూఎఫ్) మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21-7, 21-7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది. సింధు కేవలం 38 నిమిషాల్లో ఒకుహారాను మట్టికరిపించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన పీవీ సింధుకు బాయ్ రూ. 20 లక్షలు నగదు పురస్కారం ప్రకటించింది. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుకు 13 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications