న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీవీ సింధును చూసి భారత్‌ మరోసారి గర్విస్తోంది: మోడీ

World Champion PV Sindhu Makes India Proud Again says PM Narendra Modi

హైదరాబాద్‌: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం గెలిచి తొలి భారత షట్లర్‌గా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై 21-7, 21-7 తేడాతో ప్రపంచ ఇదో ర్యాంకర్‌ సింధు ఘన విజయం సాధించింది.

<strong>ఒకుహరపై ఘన విజయం.. చరిత్ర సృష్టించిన పీవీ సింధు</strong>ఒకుహరపై ఘన విజయం.. చరిత్ర సృష్టించిన పీవీ సింధు

మహిళల సింగిల్స్‌లో అద్వితీయ ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించిన సింధుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ గవర్నర్‌ హరిచందన్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు క్రీడాకారులు, బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

'సింధు సాధించిన విజయాన్ని చూసి భారత్ మరోసారి గర్విస్తోంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించినందుకు ఆమెకు అభినందనలు. అంకితభావం, పట్టుదలతో విజయం సాధించి స్ఫూర్తిగా నిలిచింది' అని ప్రధాని ట్వీట్‌ చేశారు. 'పీవీ సింధు అద్భుత విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారని, సింధు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

'చారిత్రాత్మక విజయం సాధించిన సింధుకు అభినందనలు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి మొదటి భారతీయ క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించారు. ఆట మొదటి నుంచి చివరివరకూ అద్భుత ప‍్రతిభ ప్రదర్శించారు. సింధు మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఏపీ సీఎం జగన్‌ ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు.

Story first published: Monday, August 26, 2019, 8:22 [IST]
Other articles published on Aug 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X