Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: రెండో రౌండ్‌లోకి హెచ్ఎస్ ప్రణయ్

World Badminton Championships 2018: HS Prannoy, Manu Attri-B Sumeeth Reddy off to winning start, advance to second round

హైదరాబాద్: చైనాలోని నాన్‌జింగ్ వేదికగా సోమవారం ప్రారంభమైన ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సత్తా చాటారు. టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ శుభారం చేశాడు.

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ పోరులో ప్రపంచ 11వ ర్యాంక్‌ ఆటగాడు ప్రణయ్‌ 21-12, 21-11 తేడాతో అభినవ్‌ మనోతా(న్యూజిలాండ్‌)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప‍్రవేశించాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన ప్రణయ్‌.. రెండో గేమ్‌లో కూడా అదే ఆటను పునరావృతం చేసి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.

28 నిమిషాల్లో ప్రత్యర్థిని సునాయాసంగా ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మరోవైపు, పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌లో మనూ అత్రి- సుమీత్‌ రెడ్ది జోడి 21-13, 21-18 తేడాతో నికోలోవ్‌-రుసెవ్‌ జంటపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌లో పెద్దగా పోరాడకుండానే గెలిచిన ఈ జోడీ రెండో గేమ్‌లో మాత్రం తీవ్రంగా శ్రమించి విజయం సాధించింది.

మహిళల డబుల్స్‌లో మాత్రం భారత్‌కు చుక్కెదురైంది. సంయోగిత, ప్రజక్త జోడీ 20-22, 14-21 తేడాతో టర్కీ ద్వయం బెంజిసు ఎర్సిటిన్‌, నజ్లికన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

Story first published: Monday, July 30, 2018, 17:30 [IST]
Other articles published on Jul 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+