Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అజర్ వల్లనే జ్వాలపై అక్కసు?

azharuddin-jwala gutta
కామన్ వెల్త్ క్రీడల్లో అశ్వినితో కలిసి బాడ్మింటన్ మహిళా డబుల్స్ విభాగంలో జ్వాల గుత్తా భారతదేశానికి స్వర్ణపతకాన్ని సాధించిపెట్టారు. మహిళా సింగిల్స్ లో హైదరాబాదీ సైనా నెహ్వాల్ విజయంపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ జ్వాల, అశ్విని జోడీపై అంతగా ఆశలు లేవు. అటువంటి సమయంలో వారిద్దరు నెంబర్ వన్ జోడీని ఓడించి స్వర్ణపతకం సాధించారు. ఇది భారత ప్రజలందరికీ అత్యంత ఆనందదాయకమైన సంఘటన. అయినా, భారత బాడ్మింటన్ అసోసియేషన్ (బిఐఎ) అధ్యక్షుడు వికె వర్మ మాత్రం ఏ మాత్రం సంతోషించలేదు. ఆట జరిగేంత వరకు వర్మ పక్కనే కూర్చున్నారు. జ్వాల, అశ్విని జోడీని అందరూ అభినందిస్తుంటే ఆయన కనీసం మాట వరుసకైనా అభినందించలేదు. దీనిపై జ్వాల గుత్తా తీవ్రంగా మండిపడిన విషయాన్ని పక్కన పెడితే వర్మకు అంతగా జ్వాలపై కోపం రావడానికి కారణమేమిటనేది వెనక్కి వెళ్తే గాని తెలియదు.

హైదరాబాదుకు చెందిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పార్లమెంటు సభ్యుడు మొహ్మద్ అజరుద్దీన్ బిఐఎకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది ఒక్కసారిగా పాత కాపులకు దిమ్మ తిరిగే విషయమైంది. జ్వాల వల్లనే అజరుద్దీన్ బాడ్మింటన్ అసోసియేషన్ పై దృష్టి పెడుతున్నారనే విషయం ఆ కోటరీకి తెలుసు. దాంతో ఒక్కసారిగా జ్వాలను, అజర్ ను నైతికంగా దెబ్బ తీసే పనికి పూనుకున్నారు. అజర్ జ్వాలతో డేటింగ్ చేస్తున్నారంటూ ఊహాగానాలు చెలరేగాయి. మీడియా కోడై కూసింది. ఉత్తరాదికి అనుకూలంగా ఉండే నేషనల్ మీడియా దానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో జ్వాల తన భర్త చేతన్ తో విడిపోయే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా, అజర్ సంగీతా బిజలానీకి విడాకులిస్తున్నారంటూ ప్రచారం సాగింది.

జ్వాలతో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను అజర్ ఖండించినా పెద్దగా పట్టించుకోలేదు. జ్వాల కుటుంబానికి, అజర్ కుటుంబానికి మధ్య గల ఏళ్ల తరబడి సంబంధాన్ని కూడా వారు గుర్తించలేదు. వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనే విషయానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. నైతికంగా అజర్ ను, జ్వాలను దెబ్బ తీసి తమ పబ్బం గడుపుకోవాలని అనుకున్నారు. ఈ తీవ్రమైన ఒత్తిడిలోనూ జ్వాల క్రీడా పాటవం తగ్గిపోలేదు. చాలా కాలంగా తాను జోడీ కట్టిన శ్రుతి కురియన్ ను వదిలేసి కొత్తగా అశ్వినితో జోడీ కట్టింది. దీంతో కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ కు స్వర్ణపతకాన్ని సాధించి పెట్టింది. ఇది వర్మకు మింగుడు పడని విషయం. చాలా కాలంగా కొనసాగుతున్న వైరాన్ని జ్వాల, అశ్విని జోడీని అభినందించకపోవడం మరోసారి బయట పెట్టుకున్నారు.
Story first published: Wednesday, November 15, 2017, 12:22 [IST]
Other articles published on Nov 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+