For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ఫైనల్లో సింధు స్వర్ణం సాధిస్తుందని అందరం ఎదురుచూశాం'

సుదీర్ఘంగా సాగిన ఫైనల్లో సింధు స్వర్ణం సాధిస్తుందని అందరం ఎదురుచూశామని గోపీచంద్ అన్నారు.

By Nageshwara Rao

హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు అద్భుతంగా ఆడిందని ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత, కాంస్య పతకాలు సాధించిన సింధు, సైనా నెహ్వాల్ కోచ్ గోపీచంద్‌లు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.

శంషాబాద్‌ విమానాశ్రయంలో వారికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింధు, గోపీచంద్‌ తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ సుదీర్ఘంగా సాగిన ఫైనల్లో సింధు స్వర్ణం సాధిస్తుందని అందరం ఎదురుచూశామని అన్నారు.

We could’ve won more medals at World Badminton Championships: Pullela Gopichand

సింధు స్వర్ణం సాధించకపోయినా తన అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుందని, ఆమె ఆడిన అత్యుత్తమ మ్యాచుల్లో ఇదొకటని గోపీచంద్ పేర్కొన్నారు. "వరల్డ్ బ్యాడ్మింటన్ ఫైనల్స్ మ్యాచ్ సుదీర్ఘంగా సాగింది. ఫైనల్స్‌లో సింధు అద్భుతంగా ఆడింది. సింధు ఆడిన ఉత్తమ మ్యచ్‌ల్లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్స్ ఒకటి. సింధు స్వర్ణం సాధిస్తుందని అందరం ఊహించాం" అని అన్నారు.

సింధు భవిష్యత్తులో వరల్డ్ ఛాంపియన్స్‌షిప్‌లో తప్పకుండా స్వర్ణం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో శ్రీకాంత్ పతకానికి సమీపంగా వచ్చాడని తెలిపారు. అందరూ బాగా ఆడారని... ప్రస్తుతం సైనా, సింధు, శ్రీకాంత్‌, కశ్యప్‌, సాయిప్రణీత్‌, ప్రణవ్‌ అందరూ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారని వెల్లడించారు.

2011 నుంచి వరుసగా పతకాలు సాధిస్తునే ఉన్నామని, ఇప్పుడు ఒకే టోర్నమెంట్‌లో 2 పతకాలు సాధించామని అన్నారు. క్రీడలకు ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న ప్రోత్సహం మరువలేనిదని గోపీచంద్ తెలిపారు.

పీవీ సింధుకు గవర్నర్ అభినందనలు
వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన పీవీ సింధుకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలియజేశారు. సింధు భవిష్యత్‌లోనూ అనేక పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. గవర్నర్‌తో పాటు సింధుకు పలువురు అభినందనలు చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+