For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుఎస్ ఓపెన్: టాప్ సీడ్‌కు షాకిచ్చిన పారుపల్లి కశ్యప్

యుఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో కశ్యప్‌ 21-16, 10-21, 21-19తో టాప్‌ సీడ్‌ లి హయున్‌-2 (కొరియా)పై విజయం సాధించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: యుఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో కశ్యప్‌ 21-16, 10-21, 21-19తో టాప్‌ సీడ్‌ లి హయున్‌-2 (కొరియా)పై విజయం సాధించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన మూడో గేమ్‌లో ఆరంభం నుంచి చివరి వరకు వెనుకంజలో ఉన్న కశ్యప్‌ అద్భుతంగా పుంజుకున్నాడు.

15-18తో వెనుకబడిన కశ్యప్‌ వరుసగా 4 పాయింట్లు గెల్చుకుని 19-18తో ఆధిక్యంలో నిలిచాడు. ఒకానొక దశలో 19-19తో పాయింట్లతో సమమైనప్పటికీ, వరుసగా రెండు పాయింట్లు సాధించి సంచలన విజయం సాధించాడు. ఆ తర్వాత గ్రెగరీ క్రూజ్‌ (హంగేరి)తో రెండో రౌండ్లో కశ్యప్‌ 21-18, 17-6తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయం నుంచి తప్పుకున్నాడు.

US Open Badminton: Parupalli Kashyap stuns the top seed, HS Prannoy advances

మరో మ్యాచ్‌లో రెండో సీడ్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21-12, 21-16తో లుకా రేబర్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. ఇక సమీర్‌ వర్మ 21-13, 21-9తో ఆర్థర్‌ హెర్నాండెజ్‌ (మెక్సికో)పై విజయం సాధించాడు. ఇక మహిళల సింగి ల్స్‌ మొదటి రౌండ్‌లో రితుపర్ణ దాస్‌ 21-16, 21-18తో రేచల్‌ హోండరిచ్‌ (కెనడా)పై వరుస గేముల్లో విజయం సాధించింది.

శ్రీకృష్ణ ప్రియ 21-13, 21-16తో మయా చెన్‌ (అమెరికా)పై గెలిచి ముందంజ వేసింది. రుత్విక శివాని 14-21, 27-25, 16-21తో మూడో సీడ్‌ అయా ఒహోరి (జపాన్‌)తో పోరాడి ఓడింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్‌ రెడ్డి జోడీ 21-15, 21-19తో కెనడా జంట జాసన్‌ అంథోని-నైల్‌ యకురాపై నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+