ప్రతిష్టాత్మక టైటిల్ విజేత సింధూకు గవర్నర్, కేసీఆర్ అభినందనలు


హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్న పీవీ సింధుకు ప్రశంసలు వెల్లువలా కురుస్తున్నాయి. ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ నెగ్గడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించిన సింధును కేసీఆర్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు విజయం సాధించడంపై ఆమె తండ్రి పీవీ రమణ హర్షం వ్యక్తం చేశారు.
తప్పకుండా విజయం సాధిస్తావ్
‘ఈ సంవత్సరం ఐదు ఫైనల్స్ ఆడినప్పటికీ.. సింధు రజతంతోనే సరిపెట్టుకుంది. అయితే ఎంతో ప్రతిష్ఠాత్మకమైన బీడబ్ల్యూఎఫ్ ఫైనల్‌లో గెలిచి సత్తా చాటింది. గతంలో ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పుడు ఎంతో బాధపడేది. అయితే ‘మన ప్రయత్నం మనం చేయాలని, తప్పకుండా విజయం సాధిస్తావ్' అని ప్రోత్సహించేవాడిని. ఈ పర్యటనకు ముందు నుంచి సింధు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. దాంతో పాటు తను చేసిన కఠోర శ్రమ కూడా తోడైంది.'
వరల్డ్ నం.1 కావాలన్నదే సింధు లక్ష్యం.
'ప్రాక్టీస్ సెషన్లు ఏదీ మిస్ కాలేదు. కోచ్‌లు చెప్పిన సూచనలు పాటించి ఈ విజయం సాధించింది. వరల్డ్ నం.1 కావాలన్నదే సింధు లక్ష్యం. ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఉన్నందున ఈ సంవత్సరం సింధుకు ఎంతో కీలకమైనది' అని రమణ అన్నారు.
సింధుకు గవర్నర్ నరసింహన్ కూడా
ప్రతిష్టాత్మక టైటిల్ విజేత సింధుకు గవర్నర్ నరసింహన్ కూడా అభినందనలు తెలియజేశారు. గతేడాది ప్రపంచ టూర్ ఫైనల్లో విజయం దక్కించుకోలేకపోయిన సింధు.. డిసెంబరులో జరిగిన పోటీల్లో మాత్రం జపాన్‌కు చెందిన బలమైన ప్రత్యర్థి ఒకుహరను ఓడించి.. విజేతగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications