'నిజంగా మరపురాని రోజే. నిజాయతీ కలిగిన ప్రపంచ స్టార్‌కు..'

హైదరాబాద్ : బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సింధుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ కోరారు. ప్రపంచ టూర్ ఫైనల్‌లో ఒకుహరపై విజయం సాధించిన సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సింధు టైటిల్ విజేతగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. దీంతోపాటు సామాజిక మాధ్యమాల వేదికగా సింధుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిందని
ఒలింపిక్స్ పతక విజేత పివి సింధు ప్రపంచ టూర్ టైటిల్ గెలవడం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిందని ఆమెను అభినందించారు. యావత్ భారత దేశానికి గర్వకారణంగా నిలిచిన సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
విజయం సాధించి చరిత్ర సృష్టించి
ఈ ఏడాదిని సింధు ఘనంగా ముగించింది. వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఒకుహరపై విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కంగ్రాట్స్ సింధు. నువ్విలాగే దేశానికి ఎన్నో పతకాలు సాధించి పెట్టాలి'.
స్వర్ణ పతకం తెచ్చిన పి.వి. సింధు
విదేశాల్లో ఆడి వెళ్లి స్వదేశానికి స్వర్ణ పతకం తెచ్చిన పి.వి. సింధుకు అభినందనలు
ఫైనల్ భయం లేదని రుజువు
బ్యాడ్మింటన్ లెజెండ్‌కు శుభాకాంక్షలు. నీకు ఫైనల్ భయం లేదని రుజువు చేశావు
Absolutely delighted for @Pvsindhu1, a genuine world star. Very proud of you. Look forward to many more.
— Harsha Bhogle (@bhogleharsha) December 16, 2018
నిజాయతీ కలిగిన ప్రపంచ స్టార్‌కు
సింధుకిది నిజంగా మరపురాని రోజే. నిజాయతీ కలిగిన ప్రపంచ స్టార్‌కు అభినందనలు. నీ పట్ల మేమెంతో గర్విస్తున్నాం. నువ్విలాగే మరిన్ని పతకాలు సాధించాలి.
ఈమాట వినడానికి ఎంత గర్వంగా
సింధు.. ఛాంపియన్. ఈమాట వినడానికి ఎంత గర్వంగా ఉంది. ఈ సంవంత్సరానికి ఘనమైన ముగింపు పలికావు'.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications