Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంతా అరగంట లోపే: పీవీ సింధు అలవోకగా: చెమట చిందించకుండా పతకాల వేటలో తెలుగు తేజం

Tokyo Olympics Badminton: PV Sindhu easily wins opening match, defeats Polikarpova

టోక్యో: క్రీడారంగంలో అత్యున్నతమైన ఈవెంట్‌గా భావించే ఒలింపిక్స్‌లో మూడో రోజు ప్రారంభ ఈవెంట్లలో భారత్.. మిశ్రమ ఫలితాలను సాధించింది. ఎన్పో ఆశలు పెట్టుకున్న స్టార్ విమెన్ షూటర్లు మను భాకర్, యశశ్విని సింగ్ డెస్వాల్.. విఫలం అయ్యారు. ఫైనల్‌కు అర్హత సాధంచలేకపోయారు. తమ వ్యక్తిగత రికార్డులను వారు సవరించినప్పటికీ..ఫైనల్‌కు చేరలేకపోయారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో మను భాకర్-12, యశశ్విని-13వ స్థానంలో నిలిచారు. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే తొలి ఎనిమిది మందిలో నిలవాల్సి ఉంటుంది.

ఈ చేదు అనుభవాన్ని మరిపించారు పీవీ సింధు. తన తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్నారు. అలవోకగా ప్రత్యర్థిపై పైచేయి సాధించారు. ఇజ్రాయెల్‌కు చెందిన పొలికర్పోవాను ఆడుతూ, పాడుతూ మట్టికరిపించారు. ఏ మాత్రం చెమటోడ్చాల్సిన అవసరం రాలేదామెకు. కనీసం ప్రతిఘటించకుండానే చేతులెత్తేసింది పోలికర్పోవా. పీవీ సింధు ప్రొఫెషనల్‌ గేమ్, ఎక్స్‌పీరియన్స్ ముందు అలవోకగా తలవంచింది. వరుస సెట్లలో ఓడిపోయింది. 21-7, 21-10 స్కోర్ తేడాతో పీవీ సింధు ఆమెపై విజయాన్ని అందుకున్నారు. ముసాషినో ఫారెస్ట్ ప్లాజా కోర్ట్ 2లో జరిగిన ఈ మ్యాచ్‌లో పీవీ సింధు రాకెట్‌కు ఎదురులేకుండా పోయింది. 28 నిమిషాల్లోనే మ్యాచ్ ఖతం చేశారు.

Tokyo Olympics 2021 : Ys Jagan Cash Reward To Athletes Representing AP | Oneindia Telugu

మోస్ట్ కన్సిక్యూటివ్ పాయింట్స్ పీవీ సింధు ఖాతాలో పడ్డాయి. మొత్తం 13 పాయింట్లను సాధించారు. ఇందులో పొలికర్పోవా రెండు పాయింట్లను మాత్రమే అందుకోగలిగారు. సింధు ఒక గేమ్ పాయింట్‌ను అందుకోగా.. పోలికర్పోవా ఇందులో ఖాతా తెరవలేకపోయింది. ఇద్దరూ ఎలాంటి సర్వీస్ తప్పిదాలను చేయలేదు. తన పతకాల వేటను చెమట చిందించకుండా ఆరంభించారు పీవీ సింధు. తన తదుపరి మ్యాచ్‌లో ఆమె హాంగ్‌కాంగ్‌కు చెందిన 34వ ర్యాంకర్ ఛెయుంగ్ ఎన్‌గన్ యి. ఎన్‌గన్‌ను ఢీ కొట్టాల్సి ఉంది. 2016 నాటి రియో డి జనేరియో ఒలింపిక్స్‌‌ ఫైనల్ దాకా వెళ్లిన పీవీ సింధుపై.. ఈ సారి అంతకుమించిన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

Story first published: Sunday, July 25, 2021, 8:35 [IST]
Other articles published on Jul 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+