న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: పీవీ సింధుకు సులువైన 'డ్రా'.. క్వార్టర్స్‌లో మాత్రం కఠిన సవాలే!!

Tokyo Olympics 2021: PV Sindhu, Sai Praneeth draw tough opponents in knockouts

కౌలాలంపూర్‌: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌ 2021 'డ్రా'ను బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్) గురువారం ప్రకటించింది. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్‌కు సులువైన 'డ్రా'లు ఎదురయ్యాయి. 2016 రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత సింధు తాజా ఒలింపిక్స్‌లో ఆరో సీడ్‌గా బరిలోకి దిగనుంది. సింధు మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ 'జె'లో తన పోరును ఆరంబించనుంది. ఇందులో సింధుతో పాటు ప్రపంచ నెంబర్‌ 34 ఎన్‌గాన్‌ (హాంకాంగ్‌), 58వ ర్యాంకర్‌ పొలకార్పోవా (ఇజ్రాయెల్‌)లు ఉన్నారు. సింధు స్థాయితో పోలిస్తే వీరిద్దరు బలహీన ప్రత్యర్థులే.

మొత్తం 16 గ్రూప్‌లు ఉండగా ఒక్కో గ్రూప్‌ నుంచి ఒక్కో ప్లేయర్‌ ముందంజ వేస్తారు. ఆపై నాకౌట్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన 14వ సీడ్‌ మియా బ్లిచ్‌ఫీల్డ్‌తో పీవీ సింధు తలపడే అవకాశ ముంది. ఇక సంచలనాలు లేకపోతే తెలుగు తేజం సింధు క్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన అకనే యామగూచితో తలపడే అవకాశం ఉంది. ఇది కఠిన సవాలే అని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరి మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. చివరిసారి వీరిద్దరూ ఆల్ ఇంగ్లాండ్‌లో తలపడగా..సింధు యమగుచిని ఓడించింది. ఈ ఇద్దరితో పాటు నోజోమి ఒకుహారా, చైనీస్ చెన్ యుఫీ, హి బింగ్జియావో కూడా గోల్డ్ కోసం పోటీపడనున్నారు.

పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ 'డి'లో భమిడిపాటి సాయిప్రణీత్‌ ఉన్నాడు. అతడు ముందంజ వేయాలంటే.. తన గ్రూప్‌లో ఉన్న మార్క్‌ కాల్జో (29; నెదర్లాండ్స్‌), జిల్బర్‌మన్‌ (47; ఇజ్రాయెల్‌)లను అధిగమించాల్సి ఉంటుంది. ప్రిక్వార్టర్స్‌లో అతను లాంగ్‌ ఆంజస్‌ (హాంకాంగ్‌)ను ఓడించగలిగితే జపాన్‌ స్టార్, ఫేవరెట్‌ మొమొటాను క్వార్టర్స్‌లో ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇక పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టి జోడీకి కఠిన డ్రా ఎదురైంది.

గ్రూప్‌ 'ఎ'లో సాత్విక్‌ జోడీ టాప్‌సీడ్‌ ఇండోనేసియా ద్వయం కెవిన్‌ సంజయ-ఫెర్నాల్డీ, ప్రపంచ నెం. 3 చైనీస్‌ తైపీ జంట లీ యాంగ్‌-వాంగ్‌ చీ, 18వ సీడ్‌ ఇంగ్లండ్‌ జంట లేన్‌-సీన్‌ వెన్‌డీ తదితర కఠినమైన ప్రత్యర్థులతో తలపడనుంది. డబుల్స్‌లో గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్స్‌కు చేరతాయి. సాత్విక్‌ ద్వయం తమ గ్రూప్‌లో మొదటి స్థానం సాధిస్తే.. గ్రూప్‌ 'డి' రన్నరప్‌ జంటను క్వార్టర్స్‌లో ఢీకొంటుంది. ఒకవేళ గ్రూప్‌ రన్నరప్‌గా నిలిస్తే గ్రూప్‌ 'బి' విజేతతో భారత్‌ జోడీ తలపడాల్సి ఉంటుంది.

Tokyo Olympics 2021 లో China కి అదొక్కటే చేదు వార్త!! || Oneindia Telugu

<strong>Tokyo Olympics 2021: అథ్లెట్లకు బంపర్ ఆఫర్.. స్వర్ణం సాధిస్తే!!</strong>Tokyo Olympics 2021: అథ్లెట్లకు బంపర్ ఆఫర్.. స్వర్ణం సాధిస్తే!!

Story first published: Friday, July 9, 2021, 14:30 [IST]
Other articles published on Jul 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X