PV Sindhu: సింధు డైట్ మెనూ ఇదే.. ఫేవరేట్ హైదరాబాదీ బిర్యానీ!!

హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌ 2021లో తెలుగు తేజం, ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు అంచనాలకు తగ్గట్లుగా రాణిస్తోంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ సింధు 21-13, 22-20తో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచిపై అద్భుత విజయం సాధించింది. 56 నిమిషాల పాటు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో అకానె ఆటకట్టించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. దేంతో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో రెండుసార్లు సెమీస్‌ చేరుకున్న తొలి భారత క్రీడాకారిణిగా సరికొత్త రికార్డు సృష్టించింది. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న సెమీస్‌లో రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సింధు తలపడనుంది.

Tokyo Olympics 2021: 'సారీ ఇండియా.. ఈ ఒలింపిక్స్‌లో గొప్ప పేరు తీసుకురాలేకపోయా'Tokyo Olympics 2021: 'సారీ ఇండియా.. ఈ ఒలింపిక్స్‌లో గొప్ప పేరు తీసుకురాలేకపోయా'

బ్రేక్‌ ఫాస్ట్‌లో పాలు, గుడ్లు:

బ్రేక్‌ ఫాస్ట్‌లో పాలు, గుడ్లు:

బ్యాడ్మింటన్ కోర్టులో బలమైన షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడే స్టార్ షట్లర్ పీవీ సింధు ఎలాంటి ఆహారం తీసుకుంటుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. బరువును, ఫిట్‌నెస్‌ను అనుగుణంగా.. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు సింధు ఫుడ్‌ మెనూలో ఉంటాయి. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో పాలు, గుడ్లతో పాటు ఇతర ప్రొటీన్లతో నిండి ఉండే ఆహారం సింధు తీసుకుంటుంది. అంతేకాదు పండ్లు కూడా తీసుకుంటుంది. ఇక శిక్షణా సమయంలో సెషన్‌ల మధ్య మరింత యాక్టివ్‌గా, బలంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉండేలా ఆమె చూసుకుంటుంది.

రెండు పూటలా రైస్:

రెండు పూటలా రైస్:

పీవీ సింధు రోజూ రెండు పూటలా (లంచ్‌ అండ్‌ డిన్నర్‌) భోజనంలో రైస్‌ తీసుకుంటుంది. దీంతోతో పాటు కూరగాయలను కూడా తీసుకుంటారు. అలాగే టోర్నమెంట్ల సమయంలో అన్నం, చికెన్‌ ఉండేలా ప్లాన్ చేస్తుంది. ట్రైనింగ్ సమయంలో అరటిపండ్లు, ప్రోటీన్ షేక్, స్నాక్ బార్‌లను అందుబాటులో ఉంచుకుంటుంది. సింధు తల్లి స్వయంగా ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటారట. ఇక హెల్దీగా ఉండే చర్యల్లో భాగంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి బ్లడ్‌ టెస్ట్‌ చేయించుకుంటారు. ఈ ఫలితాలకనుగుణంగా తన డైట్‌ను సింధు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది.

ఫేవరేట్ హైదరాబాదీ బిర్యానీ:

ఫేవరేట్ హైదరాబాదీ బిర్యానీ:

మ్యాచ్‌ గెలిచిన తరువాత పీవీ సింధు ఫాస్ట్‌ ఫుడ్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తుందట. కేకులు, పేస్ట్రీలు, ఐస్ క్రీమ్, చాక్లెట్లు వంటిని అప్పుడు తింటుంది. చీట్‌ మీల్‌లో భాగంగా హైదరాబాదీ బిర్యానీ తన మెనూలో టాప్‌లో ఉంటుందట. తక్కువ నూనె, కూరగాయలతో చేసిన నూడుల్స్, స్పఘెట్టి, పాస్తా లాంటివి కూడా సింధు తీసుకుంటుంది. రెగ్యులర్‌గా కాకున్నా అప్పుడప్పుడు వాటిని టెస్ట్ చేస్తారట. సాధారణంగా ప్రొఫెషనల్ అథ్లెట్లు తక్కువ నూనె వస్తువులను వాడుతారన్న విషయం తెగెలిసిందే. ఇక ఈదిన మ్యాచ్ తర్వాత అరగంటలోపు ఏదో ఒకటి తిని రెస్ట్‌ తీసుకుంటుంది.

హై-పెర్ఫార్మెన్స్ ఫిట్‌నెస్:

హై-పెర్ఫార్మెన్స్ ఫిట్‌నెస్:

పీవీ సింధు కోసం ప్రత్యేకంగా హై-పెర్ఫార్మెన్స్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను కస్టమైజ్ చేశామని ఆమె కోచ్‌ శ్రీకాంత్‌ వర్మ చెప్పారు. ముఖ్యంగా సింధు ఆట, బాడీ తీరు, ఆమె బలాబలాలు వీటన్నింటినీ దృష్టి ఉంచుకుని ఇదంతా రూపొందిస్తాడట. పతకాల బరిలో నిలిచే క్రీడాకారులు హైఇంటెన్సిటీ షెడ్యూల్‌కు సిద్ధంగా ఉంటారట. ముఖ్యంగా వారంలో ఆరు రోజులు, రెండున్నర గంటలు కఠినమైన శిక్షణా విధానాన్ని సింధు అవలంబిస్తుందట. సికింద్రాబాద్‌లోని సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీలో హెడ్ స్ట్రెంత్, కండిషనింగ్ కోచ్‌గా శ్రీకాంత్‌ వర్మ పనిచేస్తారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, July 31, 2021, 16:38 [IST]
Other articles published on Jul 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X