న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైనా కెప్టెన్సీలో ఉబెర్ సమరం, కొత్త స్కోరింగ్‌ పాలసీకి నో

Thomas and Uber Cup: With likes of Kidambi Srikanth and PV Sindhu missing, Indian shuttlers face Herculean task

హైదరాబాద్: ఆటను ఆకర్షణీయం చేసేందుకు గాను ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) కొత్త స్కోరింగ్ విధానానికి యత్నించి బెడిసికొట్టింది. ఇందులో భాగంగా 11 పాయింట్ల ఐదు సెట్ల మ్యాచ్‌ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ విధానానికి ఆమోదం లభించకపోగా, అగ్రశ్రేణి క్రీడాకారులతో పాటు.. చాలా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. అయినా బీడబ్ల్యూఎఫ్‌ వెనక్కి తగ్గలేదు. సర్వ సభ్య సమావేశంలో ఆమోదం లభిస్తే కొత్త స్కోరింగ్‌ విధానాన్ని అమలు చేయాలనుకుంది.

అక్కడ కూడా ఓటింగ్‌లో తగినంత మెజారిటీ రాకపోవడంతో ప్రతిపాదనను ఉపసంహరించుకోక తప్పలేదు. కొత్త స్కోరింగ్‌కు అనుకూలంగా ఎక్కువ ఓట్లు నమోదవడం విశేషం. 129 మంది మార్పు కోరుకోగా.. 123 మంది పాత పద్ధతికే ఓటేశారు. మూడులో రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో బీడబ్ల్యూఎఫ్‌ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రస్తుతం 21 పాయింట్ల మూడు గేమ్‌ల మ్యాచ్‌లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

నిబంధన విషయంలో మాత్రం తగ్గేదే లేదు

నిబంధన విషయంలో మాత్రం తగ్గేదే లేదు

అయితే సర్వీస్‌ నిబంధన విషయంలో మాత్రం బీడబ్ల్యూఎఫ్‌ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆల్‌ ఇంగ్లాండ్‌ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సర్వీస్‌ నిబంధనను డిసెంబరు 10 వరకు పరిశీలించాలని నిర్ణయించింది.

సిద్ధంగా ఉన్న పెను సవాలు:

సిద్ధంగా ఉన్న పెను సవాలు:

భారత షట్లర్లకు పెను సవాలు సిద్ధంగా ఉంది. నేటి నుంచే థామస్‌ కప్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌. ప్రణయ్‌ నేతృత్వంలో థామస్‌ కప్‌లో, సైనా నేతృత్వంలో ఉబెర్‌కప్‌లో భారత్‌ బరిలోకి దిగుతోంది. పీవీ సింధు, శ్రీకాంత్‌ల గైర్హాజరీలో టోర్నీలో భారత్‌కు స్టార్‌ ఆకర్షణ వీళ్లే.

మహిళల జట్టు (ఉబెర్‌కప్‌) రెండు కాంస్యాలు

మహిళల జట్టు (ఉబెర్‌కప్‌) రెండు కాంస్యాలు

గత రెండు టోర్నీల్లో మహిళల జట్టు (ఉబెర్‌కప్‌) రెండు కాంస్యాలు గెలవగా.. పురుషుల జట్టు (థామస్‌కప్‌) మాత్రం గత ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా నాకౌట్‌కు చేరలేదు. పురుషుల జట్టులో ప్రణయ్‌తో పాటు సాయి ప్రణీత్‌, సమీర్‌ వర్మ, లక్ష్యసేన్‌ సింగిల్స్‌లో తలపడనున్నారు. మను అత్రి-సుమీత్‌ రెడ్డి, అర్జున్‌ రెడ్డి-శ్లోక్‌ రామచంద్రన్‌ డబుల్స్‌ బాధ్యతలు మోయనున్నారు.

మరింత బలం కోల్పోయిన మహిళల జట్టు

మరింత బలం కోల్పోయిన మహిళల జట్టు

కామన్వెల్త్‌ క్రీడల డబుల్స్‌ రజతం గెలిచిన సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ ఈ టోర్నీకి దూరమైంది. భారత జట్టు ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, చైనాలతో పాటు గ్రూప్‌-ఏలో ఉంది. ఫ్రాన్స్‌తో పోరుతో ఆదివారం భారత్‌ థామస్‌కప్‌ టోర్నీ ఆరంభమవుతుంది. ఇక సింధుతో పాటు అశ్విని-సిక్కి రెడ్డి జోడీ కూడా లేకపోవడంతో మహిళల జట్టు మరింత బలం కోల్పోయింది.

Story first published: Sunday, May 20, 2018, 16:48 [IST]
Other articles published on May 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X