Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Thomas Cup: 73ఏళ్ల చరిత్రలో తొలిసారి టీమిండియా ఫైనల్‌కు

Thomas Cup : Team India mens team reached the final for the first time after beating Denmark

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతున్న థామస్ ఉబెర్ కప్‌లో టీమిండియా మెన్స్ టీం చరిత్రపుటలకెక్కె విజయాన్ని అందుకుంది. 73ఏళ్ల చరిత్రగల థామస్‌ కప్‌ టోర్నీలో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. కనీసం రజత పతకమైన ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో డెన్మార్క్‌తో టఫ్ అండ్ టఫ్ పోటీ జరగగా.. టీమిండియా 3-2తో గెలిచింది. ఇక ఆదివారం ఫైనల్ జరగనుంది. ఫైనల్లో 14సార్లు థామస్ కప్ ఛాంపియన్‌గా పేరున్న ఇండోనేసియా టీంతో టీమిండియా తలపడనుంది. మరో సెమీఫైనల్లో ఇండోనేసియా 3-2తో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

మొదట ఓటమి.. తర్వాత గెలుపుతో రేసులోకి

ఇక సెమీఫైనల్ అత్యంత ఉత్కంఠకరంగా జరిగింది. తొలుత ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్ ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 49నిమిషాల పాటు సాగిన సింగిల్స్ మ్యాచ్‌లో 13-21, 13-21తో ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి డబుల్స్‌లో జోరుగా ఆడారు. ఆట ఏకంగా 78నిమిషాలపాటు సాగింది. ఈ మ్యాచ్‌లో సాత్విక్‌, చిరాగ్‌ 21-18, 21-23, 22-20 తేడాతో కిమ్‌ ఆస్‌ట్రప్‌-మథియాస్‌ క్రిస్టియాన్సన్‌ జోడీని ఓడించి స్కోరు బోర్డును 1-1తో సమం చేసింది.

కిదాంబి శ్రీకాంత్ విరోచిత పోరాటం

కిదాంబి శ్రీకాంత్ విరోచిత పోరాటం

మూడో మ్యాచ్‌లో టీమిండియా బ్యాడ్మింటన్ స్టార్, ఏపీ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌ వీరోచితంగా పోరాడాడు. ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆండెర్స్‌ ఆంటోన్సెన్‌తో జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ అయిన శ్రీకాంత్‌ 80నిమిషాల పాటు తలపడ్డాడు. 21-18, 12-21, 21-15 తేడాతో గెలుపొంది భారత్‌కు 2-1ఆధిక్యాన్ని అందించాడు. కచ్చితంగా గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో డెన్మార్క్‌ ప్లేయర్లు రెచ్చిపోయారు. ఆండెర్స్‌ రస్‌ముసెన్‌-ఫ్రెడెరిక్‌ జోడీ 21-14, 21-13తో టీమిండియా డబుల్స్ జోడీ పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌-గారగ కృష్ణప్రసాద్‌‌ను ఓడించి స్కోరును 2-2తో సమం చేసింది.

డిసైడర్లో అద్భుతం చేసిన ప్రణయ్

డిసైడర్లో అద్భుతం చేసిన ప్రణయ్

ఇక స్కోరు 2-2తో సమం కావడంతో 5వ మ్యాచ్ డిసైడర్‌గా మారింది. ప్రపంచ 13వ ర్యాంకర్‌ రస్‌ముస్‌ జెమ్కెతో జరిగిన మ్యాచ్‌లో 23వ ర్యాంకర్‌ అయిన ప్రణయ్‌ 73నిమిషాల పాటు తలపడ్డాడు. తొలి సెట్ ఓడిపోయినా.. వరుసగా రెండు సెట్లు గెలిచి భారత్‌కు మరపురాని విజయాన్ని అందించాడు. 13-21, 21-9, 21-12తేడాతో గెలుపొందాడు. దీంతో భారత్‌ తొలిసారి థామస్‌ కప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌ మధ్యలో ప్రణయ్‌‌కు చీలమండ గాయమైంది. మ్యాచ్‌లో ఇంజూర్ బ్రేక్ తీసుకున్నాక ప్రణయ్ చెలరేగిపోయాడు. నొప్పి బాధిస్తున్నా తన సత్తా మేరకు పోరాడి టీమిండియాను చరిత్రపుటల్లొకెక్కిచ్చాడు.

1949నుంచి జరుగుతుండగా ఇదే తొలిసారి

1949నుంచి జరుగుతుండగా ఇదే తొలిసారి

ఇక ఈ మ్యాచ్ విజయంతో ఈ టోర్నీ చరిత్రలోనే తొలిసారి టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. 1949నుంచి ఈ టోర్నీ జరుగుతుండగా.. భారత్ ఎప్పుడూ ఈ స్థాయి ప్రదర్శన చేయలేదు. తాజా విజయంతో 73ఏళ్ల చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరింది. ఇక టీమిండియా చూపు ఫైనల్ మీదే ఉంది. ఫైనల్లో అరివీర భీకర టీం అయిన ఇండోనేషియా టీంతో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో 14సార్లు గెలిచిన ఇండోనేషియా టైటిల్ ఫేవరెట్ అయినప్పటికీ.. టీమిండియా సైతం అద్భుతం చేసే అవకాశాలు లేకపోలేదు.

Story first published: Saturday, May 14, 2022, 8:45 [IST]
Other articles published on May 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+