Thomas Cup: హిస్టరీ క్రియేట్ చేసిన టీమిండియా.. 73ఏళ్ల చరిత్రలో తొలిసారి థామస్ కప్ కైవసం

థాయ్‌లాండ్‌లోని ఇంపాక్ట్ అరేనాలో ఆదివారం జరిగిన థామస్ కప్ ఫైనల్‌లో 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియా జట్టును 3-0తో ఓడించిన టీమిండియా బ్యాడ్మింటన్ మెన్స్ టీం భారత్‌కు తొలి థామస్ కప్‌ను అందించింది. 73ఏళ్ల చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్క్రతమైంది. మూడో మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21 తేడాతో జోనటన్ క్రిస్టీని వరుస సెట్లలో ఓడించడంతో 3-0తేడాతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. దీంతో బ్యాడ్మింటన్లో భారత్ మరో అరుదైన ఫీట్ సాధించింది.
ఇక ఫైనల్లో తొలి మ్యాచ్‌లో ఇండోనేషియా ఆటగాడు ఆంథోనీ గింటింగ్‌ను ఓడించిన లక్ష్య సేన్ భారత్‌కు 1-0ఆధిక్యాన్ని అందించాడు. మొదటి సెట్‌ను 8-21తో కోల్పోయిన తర్వాత రెండో సెట్లో సేన్ అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా రెండు, మూడు సెట్లలో చెలరేగి ఆడాడు. గంటా ఐదు నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సేన్ 8-21, 21-17, 21-16తో గింటింగ్‌ను ఓడించాడు. జింటింగ్ మొదటి గేమ్‌ను 21-8తో చేజిక్కించుకోవడంతో భారత శిబిరంలో టెన్షన్ మొదలు కాగా తన సత్తాను చాటిన లక్ష్యసేన్ ఇక రెండు, మూడు సెట్లలో గెలిచి భారత్ ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.

చెలరేగిన సాత్విక్, చిరాగ్ శెట్టి
ఇక రెండో మ్యాచ్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి డబుల్స్ జోడీ 18-21, 23-21, 21-19తేడాతో మహ్మద్ అహ్సన్, కెవిన్ సంజయ సుకముల్జోపై విజయం సాధించారు. దీంతో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ టోర్నమెంటులోనే టీమిండియా తరఫున ఫేవరేట్ అయిన కిదాంబి శ్రీకాంత్ మూడో మ్యాచ్‌లో బరిలో దిగాడు. ఆసాంతం మ్యాచ్ ఉద్విగ్నంగా సాగింది. భారత ఆశలన్నీ శ్రీకాంత్‌పైనే ఉన్నాయి. ఇక ప్రపంచ నంబర్ 11 అయిన శ్రీకాంత్ వరుస గేమ్‌లతో 21-15, 23-21తేడాతో ప్రపంచ నంబర్ 8వ ప్లేయర్ జొనాటన్ క్రిస్టీపై అద్వితీయ విజయం నమోదు చేశాడు.

నరాలు తెగే ఉత్కంఠ నడుమ కిదాంబి శ్రీకాంత్ అద్భుతం
రెండో సెట్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్ సాగింది. ఇక మూడో సెట్ వరకు మ్యాచ్ వెళ్లే క్రమంలో అద్భుతంగా పుంజుకున్న కిదాంబి శ్రీకాంత్.. క్రిస్టీకి మూడో సెట్ ఛాన్స్ ఇవ్వకుండా రెండో సెట్లోనే ఆట ముగించాడు. దీంతో భారత శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. ఇక ఇప్పటికే 3-0తో విజయం దక్కడంతో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ తలపడాల్సిన అక్కర్లేదు. సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్, ధృవ్ కపిల డబుల్స్ జోడీ కూడా తలపడకుండానే కప్ భారత్ సొంతమైంది.
బ్యాడ్మింటన్లో భారత్‌కు మరో కీర్తి పతాక
ఇక థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా మెన్స్ టీం సెమీఫైనల్లో డెన్మార్క్‌తో టఫ్ అండ్ టఫ్ పోటీ జరగగా.. 3-2తో గెలిచింది. ఇక ఆదివారం ఫైనల్ జరగగా.. ఫైనల్లో 14సార్లు థామస్ కప్ ఛాంపియన్‌గా పేరున్న ఇండోనేసియా టీంతో అమీతుమీ తేల్చుకున్న టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసింది. బ్యాడ్మింటన్‌లో గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్లేయర్లు అత్యుత్తమ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో బ్యాడ్మింటన్లో భారత కీర్తి పతాక మరోస్థాయికి చేరుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications