Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీకాంత్‌, శంకర్ జోరు.. క్వార్టర్స్‌లోకి ఎంట్రీ

బ్యాంకాక్ వేదికగా జరుగుతోన్న థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ వరల్డ్ టూర్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్లు మంచి ప్రదర్శన చేశారు. తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణ్యన్‌ క్వార్టర్‌ఫైనల్ కు అర్హత సాధించారు.

హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో జేసన్‌ గుణవన్‌ (హాంకాంగ్‌)పై శ్రీకాంత్‌ 21-19, 21-15, మూడో సీడ్‌ చికో వార్డోయో (ఇండోనేసియా)పై శంకర్ సుబ్రమణ్యన్‌ 9-21, 21-10, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో తమ అనుభవంతో దూకుడు ప్రదర్శించి ఈ ఇద్దరూ గెలుపొందారు. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్ లో సుబ్రమణ్యన్ చైనాకు చెందిన ఝు-జువాన్‌ చెన్‌తో.. కిదాంబి శ్రీకాంత్‌ చైనాకు చెందిన వాంగ్‌తో తలపడనున్నారు.

Thailand Masters 2025 India s Kidambi Srikanth Sankar Subramanian enters into Quarter-Finals

మెన్స్ డబుల్స్‌ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్ లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్‌- సాయి ప్రతీక్‌ ద్వయం 14-21, 21-10, 21-9 తేడాతో విచయపోంగ్‌- నరుసెత్‌ (థాయ్‌లాడ్‌) జోడీపై గెలిచి క్వార్టర్స్‌లోకి ఎంటర్ అయింది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌ ఫైనల్ లో శివాని రోహన్‌ కపూర్‌ - రుత్విక శివాని ద్వయం 19-21, 15-21 తేడాతో రచపోల్‌- నతమోన్‌ (థాయ్‌లాండ్‌) జోడీపై ఓటమిని అందుకుంది.

మహిళల సింగిల్స్‌ విభాగంలో రక్షిత శ్రీ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను కన్ఫామ్ చేసుకుంది. 21-15, 21-12 తేడాతో క్లౌ టాంగ్‌ టుంగ్‌ (చైనీస్‌ తైపీ)పై రక్షిత శ్రీ విజయం సాధించింది.

Story first published: Friday, January 31, 2025, 7:55 [IST]
Other articles published on Jan 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+