పోటాపోటీ: కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర సింధుకు వైసిపి నేత 2 ఎకరాలు, కేటీఆర్ చక్రం
హైదరాబాద్: రియోలో రజతం గెలిచిన పీవీ సింధుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ చందర్ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫాం హౌస్ సమీపంలో రెండు ఎకరాలను ఇస్తున్నారు.
కరకపట్లలో రెండు ఎకరాల భూమిని సింధు పేరిట రిజిస్ట్రేషన్ చేసి పార్టీ అధినేత జగన్ చేతుల మీదుగా అంద చేస్తామని ఆయన చెప్పారు. రియోలో రజతం గెలిచిన సింధుకు పోటాపోటీగా నజరానాలు వెల్లువెత్తుతోన్న విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం సింధుకు నజరానాలు ఇవ్వడంలో పోటీ పడ్డాయని తెలుస్తోంది. ఏపీలో ప్రభుత్వం తరఫున ఇచ్చినందున.. వైసిపి నేత విజయ చందర్ ఆమెకు భూమిని ఇస్తుండటం గమనార్హం.

కేటీఆర్ వల్లే..
తెలంగాణ క్రీడా విధానం ప్రకారం సింధుకు రూ.1 కోటి లభిస్తుందని చాలామంది భావించారు. కానీ సింధును మరింత ఘనంగా సన్మానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి కేటీ రామారావు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి(బీఏటీ) అధ్యక్షులు కూడా కావడంతో ఈ వ్యవహారాన్ని ఆయనే పర్యవేక్షించారు. సింధుకు భారీ నజరానా ప్రకటింపజేయడంలో సఫలమయ్యారు. బీఏటీకి గోపీచంద్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

నజరానాల విలువ రు.12 కోట్ల పైనే
రజతం సాధించిన పీవీ సింధుకు నజరానాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మొత్తం నజరానాల విలువ రూ.12 కోట్లకు పైగానే ఉంది. తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్లు, ఏపీ రూ.3 కోట్లు రివార్డు ప్రకటించింది. ఇరు ప్రభుత్వాలు.. ఇంటికి వెయ్యి గజాల స్థలం ఇస్తుంది.

ఏపీ, తెలంగాణల కాసుల వర్షం
అమరావతిలో వెయ్యి గజాలు, హైదరాబాదులో వెయ్యి గజాలు ఇస్తారు. ఏపీలో గ్రూప్ ప్రభుత్వ ఉద్యోగం. పీవీ సింధు అంగీకరిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగం. సింధూకు డిల్లీ ప్రభుత్వం రూ.2 కోట్లు ఇచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షలు ప్రకటించింది.

కర్నాటక సీఎం రూ.10 లక్షలు
సింధుకు ఫుట్‌బాల్ ఫెడరేషన్ రూ.5 లక్షలు, నిస్సాన్ నుంచి రెడి గో కారు ఇశ్తున్నారు. బీపీసీఎల్ రూ.75 లక్షలు ప్రకటించింది. సింధు ఇందులో ఉద్యోగిని. ఆమెకు డిప్యూటీ మేనేజర్‌గా పదోన్నతి లభించింది. బాయ్ రూ.50 లక్షలు ప్రకటించింది. కర్నాటక సీఎం కుమారస్వామి రూ.10 లక్షలు ఇస్తానని చెప్పారు. నటుడు సల్మాన్ ఖాన్ రూ.వెయ్యి ఇస్తానని చెప్పారు.

సాక్షి మాలిక్‌కు తెలంగాణ రూ.కోటి
సచిన్ టెండుల్కర్ చేతుల మీదుగా చాముండేశ్వరీ నాథ్ రూ.60 లక్షల రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యు కారు ఇవ్వనున్నారు. ఇక, తెలంగాణ ప్రభుత్వం రెజ్లర్ సాక్షి మాలిక్‌కు కూడా రూ.కోటి ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం ఆర్టీసీలో పని చేస్తున్న సాక్షి మాలిక్ తండ్రికి పదోన్నతి కల్పించింది. కాగా, ఒలింపిక్స్‌కు వెళ్లేముందు.. పతకం సాధించిన వారికి రూ.కోటి నజరానా అందిస్తామని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించినట్లుగా వార్తలు వచ్చాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications