For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చరిత్ర సృష్టించిన తన్వీ శర్మ!

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసిన 17 ఏళ్లలో మొదటి భారతీయ మహిళా క్రీడాకారణిగా తన్వీ శర్మ చరిత్ర సృష్టించింది. ఒక గేమ్ లో వెనుకబడిన తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఈ 16 ఏళ్ల క్రీడాకారిణి జపాన్‌కు చెందిన సాకి మాత్సుమోటోను ఓడించి బాలికల సింగిల్స్ సెమీ-ఫైనల్లోకి ప్రవేశించింది. తన్వీ శర్మ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన సాకి మాత్సుమోటోను 47 నిమిషాల్లో 13-15, 15-9, 15-10 తేడాతో ఓడించింది. ఈ విజయంతో తన్వీ పతకం ఖాయమైంది.

భారత్‌కు చెందిన మరో క్రీడాకారిణి ఉన్నతి హుడా(ఎనిమిదో సీడ్) సెమీ-ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఆమె థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్ అన్యాపత్ ఫిచిత్‌ఫోన్ చేతిలో 12-15, 13-15 తేడాతో ఓటమిపాలైంది. (ఉన్నతి హుడా ఒడిశా ఓపెన్ సూపర్ 100 టైటిల్ గెలిచిన అతి పిన్న వయస్కురాలైన భారతీయురాలు, 2022 ఉబెర్ కప్ జట్టులో కూడా సభ్యురాలు). బాలికల డబుల్స్‌లో భారత జంట భవ్యా ఛబ్రా, విశాఖ తోప్పో చైనీస్ తైపీకి చెందిన హుంగ్ బింగ్ ఫు, చౌ యున్ ఆన్ చేతిలో 9-15, 7-15 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Tanvi Sharma Creates History at BWF World Junior Championship 2025

పురుషుల డబుల్స్‌లో భార్గవ్ రామ్ అరిగెల, విశ్వ తేజ్ గోబురు క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన ఆసియా జూనియర్ ఛాంపియన్స్ చెన్ జున్ టింగ్, లియు జున్ రోంగ్ చేతిలో 12-15, 10-15 తేడాతో ఓటమి పాలయ్యారు. బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జ్ఞాన్ దత్తు కూడా చైనాకు చెందిన మూడో సీడ్ లియు యాంగ్ మింగ్ యూ చేతిలో 15-11, 15-13 తేడాతో ఓడిపోయాడు.

చరిత్రలో భారతీయ మహిళా పతక విజేతలు
ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్‌లో చివరిసారిగా భారత మహిళా క్రీడాకారిణి పతకం గెలిచింది సైనా నెహ్వాల్. ఆమె 2008లో పుణెలో జరిగిన ఈ టోర్నీలో స్వర్ణ పతకం సాధించింది. సైనా నెహ్వాల్ 2006లో రజత పతకం కూడా గెలుచుకుంది. అపర్ణా పోపట్ 1996లో రజత పతకాన్ని సాధించింది. తన్వీ శర్మ సాధించిన ఈ విజయం 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత బ్యాడ్మింటన్‌కు లభించిన పతకం. ఇది దేశానికి గర్వకారణం.

Story first published: Saturday, October 18, 2025, 9:32 [IST]
Other articles published on Oct 18, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+