న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంత ప్రయత్నించినా సైనాకు విజయం దక్కలేదు

Tai Tzu Ying proves Saina’s nemesis again at Indonesia Masters

హైదరాబాద్: ఇండోనేషియా ఓపెన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో సైనా ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ చేతిలో 21-9, 21-13 తేడాతో ఓటమి పాలై టైటిల్‌ను చేజార్చుకుంది. అంతకుముందు రోజు పీవీ సింధుతో పోరాడి గెలిచిన సైనా అదే జోరును ఫైనల్‌లో చూపించలేకపోయింది.

ప్రపంచ నంబర్ 1 అయిన ప్రత్యర్థి ముందు తలొంచింది. తొలి గేమ్‌ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన తై జు చివరి వరకూ అదే జోరును కొనసాగించింది. 11-5 పాయింట్ల స్కోరు ఉన్నప్పుడు సైనా ప్రత్యర్థిని అధిగమించాలని తీవ్రంగా శ్రమించింది. ఈ తరుణంలో సైనా చేసిన ప్రతి ప్రయత్నం తై జు కు అనుకూలంగా మారింది. దీంతో ఈ రౌండ్ ముగిసే సరికి 9-16 పాయింట్లతో నిలిచారు.

సైనా కేవలం రెండు భారీ షార్ట్స్‌ను కొట్టి పాయింట్లను గెలుచుకునే ప్రయత్నంలో తైజు రెండింటిని అందుకోవడంతో బురిడీ కొట్టినట్లైంది.

తై జు ఇండోనేషియా మాస్టర్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి చైనీస్‌ తైపే క్రీడాకారిణిగా తై జు నిలిచింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 28, 2018, 14:59 [IST]
Other articles published on Jan 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X