బాసెల్: ప్రపంచ ఛాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్ట్‌ను వరుస సెట్లలో ఓడించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నాలుగో సీడ్ క్రీడాకారిణి అయిన మియాను 22-20, 21-10తో ఓడించింది. మ్యాచ్ 43 నిమిషాల్లో ముగిసింది. ఇక జనవరిలో జరిగిన యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్‌లో తొలి రౌండ్లో జరిగిన ఓటమికి సింధు ప్రతీకారం తీర్చుకుంది.
తొలి గేమ్‌లో మియా బ్లిచ్‌ఫెల్ట్ నుంచి పీవీ సింధుకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కానీ కీలక సమయంలో సింధు పుంజుకుని గేమ్‌ను గెలుచుకుంది. ఇక రెండో గేమ్‌లో తెలుగు షట్లర్ ముందు బ్లిచ్‌ఫెల్ట్ తేలిపోయింది. ఆదివారం జరిగే స్విస్ ఓపెన్ టైటిల్ కోసం ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్ లేదా థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చోచువాంగ్‌తో సింధు తలపడనుంది. 2019లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్ తరువాత ఫైనల్‌కు వెళ్లడం సింధుకు ఇదే తొలిసారి.
శుక్రవారం మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో రెండో సీడ్ పీవీ సింధు 21-16, 23-21తో అయిదోసీడ్ బుసానన్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి సింధుకు తీవ్రప్రతిఘటన ఎదురైంది. కానీ కీలక సమయంలో రెండు పాయింట్లు చేజిక్కించుకున్న ఆమె.. గేమ్‌తో పాటు మ్యాచ్ గెలిచి ముందంజ వేసింది.
ఇక పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లోకి తెలుగు ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ప్రవేశించాడు. థాయిలాండ్‌కు చెందిన సిక్త్ సీడ్ కంటఫాన్ వాంగ్చరోయెన్తో శుక్రవారం రాత్రి జరగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ చెలరేగిపోయాడు. 21-19, 21-15తో వరుస గేముల్లో విజయం సాధించాడు. సాయి ప్రణీత్, అజయ్ జయరాంలు మాత్రం క్వార్టర్స్‌లో ఓడారు. ప్రణీత్ 14-21, 17-21తో లీ జీ జియా (మలేసియా) చేతిలో ఓడగా.. అజయ్ 9-21, 6-21తో విదిత్సరన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడాడు.
India vs England: టెస్ట్ సిరీస్‌లో నమోదైన పలు రికార్డులు.. అవార్డ్స్ లిస్ట్ ఇదే!!