పగ తీర్చుకుంది: మారిన్‌పై సింధు అద్భుత విజయం
హైదరాబాద్: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దూసుకుపోతుంది. గ్రూప్ దశలో తనకంటే మెరుగైన ర్యాంకర్లను ఇద్దరిని ఓడించి సింధు సెమీస్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన చివరి గ్రూప్-బి పోరులో పదో ర్యాంకర్ సింధు 21-17, 21-13తో వరుస గేముల్లో కరోలినా మారిన్‌పై విజయం సాధించింది.
దీంతో రియో ఒలింపిక్స్ ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఎదురైన పరాజయానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బదులు తీర్చుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్ 'బి' చివరి లీగ్ మ్యాచ్‌లో సింధు 21-17, 21-13తో మాజీ వరల్డ్ నెంబర్‌వన్, ఒలింపిక్ చాంపియన్ మారిన్‌ను మట్టికరిపించింది.
ఈ మ్యాచ్‌ను సింధు 46 నిమిషాల్లో ముగించింది. మారిన్ గాయం కారణంగా భారత షట్లర్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచిన సింధు గ్రూప్-బిలో రెండో స్థానంతో సెమీస్‌కు అర్హత సాధించింది. మారిన్ వరుసగా మూడు పరాజయాలతో ఈ టోర్నీని ముగించి ఇంటిదారి పట్టింది.

సింధు మెరుగైన ప్రదర్శన
సెమీస్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగిన సింధు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. తొలి గేమ్ ఆరంభం నుంచే ఒక్కో పాయింట్ కోసం సింధు, మారిన్ హోరాహోరీగా తలపడ్డారు. మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 7-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీటుగా బదులిచ్చిన భారత షట్లర్ వెంటనే 7-7తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత 11-10తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. బ్రేక్ తర్వాత కూడా ఆట నువ్వా-నేనా అన్నట్టు సాగడంతో ఆధిక్యం మారుతూ వచ్చింది.

గాయం కారణంగా కోర్టులో కదల్లేని మారిన్
ఒక్క సారిగా గేర్ మార్చిన సింధు పదునైన స్మాష్‌లతో నాలుగు పాయింట్లు గెలిచి మారిన్‌పై 16-12తో ముందంజ వేసింది. గాయం కారణంగా మారిన్ కోర్టులో చురుగ్గా కదల్లేకపోయింది. సింధు 20-14తో గేమ్ పాయింట్‌పై నిలిచిన ఈ దశలో మారిన్ మూడు గేమ్ పాయింట్లు గెలుచుకుని 17-20తో పుంజుకునే ప్రయత్నం చేసింది. అయితే సింధు దూకుడుగా ఆడుతూ తొలి గేమ్‌ని సొంతం చేసుకుంది.

రెండో గేమ్‌లో సింధు దూకుడు
ఇక రెండో గేమ్‌లో మాత్రం సింధు తన దూకుడుని ప్రదర్శించింది. ఆరంభంలోనే కరోలినా కాస్త పోరాడే ప్రయత్నం చేసింది. గాయం బాధిస్తున్నా వేగంగా ఆడిన మారిన్ 2-1, 3-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో సింధు 3-3తో స్కోరు సమం చేసింది. తర్వాత భారత షట్లర్ 5-4, 6-4తో ముందంజ వేసింది. బాగా అలసిపోయిన కరోలిన్.. సింధు రిటర్న్‌లకు ధీటుగా బదులు ఇవ్వలేకపోయింది.

అనవసర తప్పిదాలు చేయని సింధు
ఇదే సమయంలో సింధు అనవసర తప్పిదాలు చేయడంతో మారిన్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 9-13తో పుంజుకునే ప్రయత్నం చేసింది. కానీ, పట్టువదలకుండా పోరాడిన సింధు 17-11తో ముందంజ వేసింది. అదే జోరుతో 20-12తో మ్యాచ్ పాయింట్‌పై నిలిచింది. చివర్లో మారిన్ కొట్టిన షాట్ నెట్‌లో పడడంతో మ్యాచ్‌ను సింధు కైవసం చేసుకుంది.

సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్‌తో సింధు
మరోవైపు గ్రూప్-బి నుంచి సున్ యు మరో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. గ్రూప్ ‘ఎ' నుంచి సుంగ్ జీ హున్ (కొరియా), తై జు యింగ్ (చైనీస్ తైపీ) సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్‌తో సింధు, సుంగ్ జీ హున్‌తో సున్ యు తలపడతారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications