For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుదిర్మన్‌ కప్‌.. సింధు, సైనా, శ్రీకాంత్‌లకు చోటు

Sudirman Cup: PV Sindhu, Kidambi Srikanth to lead India

స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో భారత జట్టు సుదిర్మన్‌ కప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో బరిలో దిగుతుంది. చైనా వేదికగా ఈ నెల 19 నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) మంగళవారం ప్రకటించింది.

భారత్‌తో పాటు చైనా, మలేసియా:

భారత్‌తో పాటు చైనా, మలేసియా:

గ్రూప్‌ 'డి'లో భారత్‌ పోటీపడనుంది. ఈ గ్రూపులో భారత్‌తో పాటు మాజీ చాంపియన్‌ చైనా, మలేసియాలు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో భాగంగా ఒక మ్యాచ్‌లో.. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో ఒక్కో మ్యాచ్‌ను నిర్వహిస్తారు. 2017 సుదిర్మన్‌ కప్‌లో భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకొని చైనా చేతిలో ఓడిపోయింది.

టాప్‌-5లో సింధు:

టాప్‌-5లో సింధు:

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో సింధు మళ్లీ టాప్‌-5లోకి వచ్చింది. తాజా ర్యాంకింగ్స్‌లో సింధు ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో ర్యాంకు సాధించింది. సైనా నెహ్వాల్‌ 9వ ర్యాంకులో కొనసాగుతుంది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 8, సమీర్‌వర్మ 15, సాయి ప్రణీత్‌ 20వ ర్యాంకులలో కొనసాగుతున్నారు.

జట్లు:

జట్లు:

పురుషుల జట్టు:

శ్రీకాంత్, సమీర్‌ వర్మ (సింగిల్స్‌).. సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, సుమీత్‌ రెడ్డి, మనూ అత్రి, ప్రణవ్‌ చోప్రా (డబుల్స్‌).

మహిళల జట్టు:

పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ (సింగిల్స్‌).. నేలకుర్తి సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, మేఘన, పూర్వీషా రామ్‌ (డబుల్స్‌).

Story first published: Wednesday, May 1, 2019, 13:20 [IST]
Other articles published on May 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+