న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుదిర్మన్‌ కప్‌లో భారత్‌కు షాక్‌...

Sudirman Cup: India Suffer 2-3 Loss To Malaysia In Absence Of Kidambi Srikanth

సుదిర్మన్‌ కప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత్‌కు మలేసియా ఊహించని షాకిచ్చింది. గ్రూప్‌1 డిలో భాగంగా మంగళవారం జరిగిన తమ తొలి పోరులో భారత్‌ 2-3తో మలేసియా చేతిలో ఓడింది. సింగిల్స్‌లో పీవీ సింధు, మిక్స్‌డ్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌-అశ్విని పొన్నప్ప గెలిచినా.. మిగతా షట్లర్లు విఫలమవడంతో భారత్‌కు పరాభవం తప్పలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

తొలుత మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు- అశ్విని పొన్నప్ప జోడీ 16-21, 21-17, 24-22తో సూన్‌ హువాత్‌- షెవోన్‌ జెమీపై విజయం సాధించడంతో భారత్‌ ఖాతా తెరిచింది. అనంతరం పురుషుల సింగిల్స్‌లో సమీర్‌వర్మ 13-21, 15-21తో లీ జియా చేతిలో ఓడటంతో 1-1తో స్కోరు సమమైంది. మహిళల సింగిల్స్‌లో సింధు 21-12, 21-8తో గో జిన్‌ వీపై నెగ్గి భారత్‌ను 2-1 ఆధిక్యంలో నిలిపింది.

ఆ తర్వాత జరిగిన పురుషుల డబుల్స్‌లో సుమిత్‌-మను జోడీ, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి- అశ్విని ద్వయం ఓడడంతో భారత్‌కు నిరాశ తప్పలేదు. ఇక బుధవారం జరిగే పోరులో చైనాపై నెగ్గితేనే భారత్‌కు నాకౌట్‌ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో నాకౌట్‌ రేసులో నిలవాలంటే చైనాతో పోరులో భారత్‌ తప్పక గెలవాలి.

Story first published: Wednesday, May 22, 2019, 9:03 [IST]
Other articles published on May 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X