
హైదరాబాద్: గాయం కారణంగా గతవారం చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ నుంచి తప్పుకున్న భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్... తాజాగా హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌కూ దూరమయ్యాడు. తొడ కండరాలు పట్టేయడంతో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకాంత్ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేదని ఫిజియో కిరణ్ తెలిపారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 'శ్రీకాంత్ కోలుకున్నాడు. గాయం పూర్తిగా తగ్గిపోయింది. ఏదైనా టోర్నీలో ఆటగాడు పాల్గొనాలంటే 100 శాతం ఫిట్‌గా ఉండాలి. 90 శాతం ఫిట్‌నెస్‌తో శ్రీకాంత్‌ను హాంకాంగ్ సూపర్ సిరీస్‌కు పంపించాలని అనుకోవడం లేదు. అందుకే మరో వారం విశ్రాంతి సూచించాం' అని కిరణ్ అన్నారు.
పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో శ్రీకాంత్ వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో బరిలోకి దిగుతాడని ఆయన అన్నారు. హాంకాంగ్ ఓపెన్ సిరీస్ ఈ నెల 21 నుంచి 26 వరకు జరగనుంది. ఇటీవలే నాగ్‌పూర్‌లో ముగిసిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ గాయపడిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.