For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీకాంత్ సంచలనం: సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి

By Pratap

సింగపూర్: తెలుగుతేజం శ్రీకాంత్ మరోసారి సంచలనం సృష్టించాడు. సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నమెంటులో ప్రపంచ పదో ర్యాంక్ ఆటగాడు తియెన్ మిన్ గుయెన్ (వియత్నాం)ను ఓడించడం ద్వారా భారత యువ బాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ సంచలనం సృష్టించాడు. ఇ

సింగపూర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో అతను గుయెన్‌పై 18-21, 21-18, 21-15 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో అతను హాంకాంగ్‌కు చెందిన యున్ హూను ఢీ కొంటాడు. మేబ్యాంక్ మలేసియా ఓపెన్ టోర్నీలో యున్ హూను శ్రీకాంత్ ఓడించాడు.

 Srikanth, Sindhu reach Singapore Open quarter finals

మరో మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 24-22, 21-19 స్కోరుతో అతి కష్టం మీద జిలియాంగ్ డెరెక్ వాంగ్‌పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. అయితే, పెంగ్యు డు చేతిలో భారత ఆటగాడు ప్రణయ్ పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. పెంగ్యు 21-17, 18-21, 21-12 తేడాతో గెలుపొందాడు. ప్రణయ్ చివరి వరకూ గట్టిపోటీనిచ్చినా ఫలితం లేకపోయింది. పారుపల్లి కశ్యప్ 16-21, 21-15, 22-20 తేడాతో డాంగ్ కెయున్ లీని ఓడించాడు.

క్వార్టర్ ఫైనల్లోకి సింధు..

మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ పరాజయాన్ని ఎదుర్కోగా, మరో హైదరాబాదీ పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. షిజుకా ఉషిదాను ఆమె 21-17, 17-21, 21-16 తేడాతో ఓడించింది. మరో మ్యాచ్‌లో పిసి తులసి పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. ఆమెను ఇహాన్ వాంగ్ 21-19, 21-7 ఆధిక్యంతో చిత్తుచేసింది.

పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు అల్విన్ ఫ్రాన్సిస్ అరుణ్ విష్ణు 17-21, 22-24 తేడాతో మహమ్మద్ అసన్, హెండ్రా సెతియావన్ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో అరుణ్ విష్ణు, అపర్ణా బాలన్‌ను గితియాన్ మార్కస్ ఫెర్నాల్డీ, రిజ్కీ అమెలియా ప్రదీప్తా జోడీ 23-21, 21-17 తేడాతో ఓడించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+