For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తన ర్యాంకుని మెరుగుపరచుకున్న శ్రీకాంత్: టాప్‌-100లో లక్ష్యసేన్‌

By Nageshwara Rao
Srikanth moves up to fourth; Lakshya Sen breaks into top-100 of BWF rankings

హైదరాబాద్: భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ తన ర్యాంకుని మెరుగుపరచుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) గురువారం ప్రకటించిన పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో కిదాంబి శ్రీకాంత్ ఒక స్ధానం మెరుగు పరుచుకొని 4వ ర్యాంక్‌ని చేజిక్కించుకున్నాడు.

16 ఏళ్ల యువ షట్లర్ లక్ష్యసేన్‌ ఏకంగా 19 స్థానాలను మెరుగుపరుచుకొని 89వ ర్యాంక్‌తో తొలిసారి టాప్‌-100లో చోటు దక్కించుకున్నాడు. లక్ష్యసేన్ ఇటీవల బల్గేరియన్ ఓపెన్, ఇండియా ఇంటర్నేషనల్ సిరీస్ టైటిల్స్‌ను గెలవడంతో 19 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు.

హెచ్ఎస్ ప్రణయ్, సాయి ప్రణీత్ వరుసగా 10, 17వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. ఇక, మహిళల సింగిల్స్‌లో సింధు 3వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, సైనా నెహ్వాల్‌ 10వ ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. రీతూపర్ణ దాస్‌ మూడు స్థానాలు మెరుగుపరచుకుని 49వ ర్యాంక్‌లో నిలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ చోప్రా, సిక్కిరెడ్డిల జోడీ 19వ ర్యాంకులో కొనసాగుతున్నారు.

Story first published: Friday, December 8, 2017, 10:19 [IST]
Other articles published on Dec 8, 2017
Read in English: Srikanth now World No 4
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+