For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టైటిళ్లు కాదు ముఖ్యం.. ఫిట్‌నెస్ సాధించాల్సిందే.. !!

Srikanth focuses on fitness to win medal at Asian Games

హైదరాబాద్: గాయం నుంచి కోలుకుని గతేడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లను గెలుచుకున్నాడు కిదాంబి శ్రీకాంత్. దీంతో అతను దిగ్గజాల సరసన నిలిచిపోయాడు. ఈ క్రమంలో అదే ఫామ్‌ను కొనసాగించాలని తాజాగా ఫిట్‌నెస్‌పైనే దృష్టి సారించాడు. గాయాల బారిన పడకుండా ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పతకం సాధించాలంటే వందశాతం ఫిట్‌గా ఉండాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో పాల్గొనే ప్రతి టోర్నీలోనూ అత్యుత్తమ ఆటను ఆడాలనుకుంటున్నానని 25 ఏళ్ల శ్రీకాంత్‌ చెప్పాడు.

ఫిట్‌నెస్‌ కాపాడుకోవడమే అతిపెద్ద ఛాలెంజ్‌:

ఫిట్‌నెస్‌ కాపాడుకోవడమే అతిపెద్ద ఛాలెంజ్‌:

‘ప్రస్తుతం ఫిట్‌నెస్‌ కాపాడుకోవడమే నాముందున్న అతిపెద్ద చాలెంజ్‌. ఒలింపిక్స్‌ తర్వాత కుడి మడమ, గతేడాది ఎడమ మడమ గాయాలతో ఇబ్బంది ఎదురైంది. ఈ ఏడాది నాలుగు, ఐదు టోర్నమెంట్‌లు నాకు చాలా కీలకం. అందుకే జాగ్రత్తగా ఉంటున్నా. గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టా' అని శ్రీకాంత్‌ వివరించాడు.

నాలుగు టైటిళ్లను సాధించి తన స్థాయిని..

నాలుగు టైటిళ్లను సాధించి తన స్థాయిని..

గతేడాది అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ హైదరాబాద్‌ స్టార్‌ ఫ్రెంచ్‌ ఓపెన్, డెన్మార్క్‌ ఓపెన్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఇండోనేసియన్‌ ఓపెన్‌ టైటిళ్లను సాధించి తన స్థాయిని పెంచుకున్నాడు. ఈ ఏడాది ఈ నాలుగు టైటిళ్లను నిలబెట్టుకోవాలనే ఒత్తిడి తనపై లేదని, ప్రస్తుతం ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీకాంత్‌ పేర్కొన్నాడు.

పునరావృతం చేయాలని అనుకోవట్లేదు

పునరావృతం చేయాలని అనుకోవట్లేదు

‘గతేడాది ప్రదర్శనను పునరావృతం చేయాలని అనుకోవట్లేదు. ఈ ఏడాది ప్రత్యేక లక్ష్యాలను పెట్టుకున్నాను. ఒకటి కామన్వెల్త్‌లో పతకం సాధించాలనుకున్నా. రెండోది ఆసియా క్రీడల్లో. ఈ రెండు టోర్నీలు చాలా ముఖ్యమైనవి. ప్రతి ఏడాది ఆడేందుకు కుదరదు. మొదటి లక్ష్యం చేరుకున్నా. ఇక ఆసియా క్రీడలు మిగిలిఉన్నాయి. ఇందులో పతకం కోసం మరో నాలుగేళ్లు నేను వేచి ఉండలేను. అప్పుడు ఈ క్రీడలకు అర్హత సాధిస్తానో లేదో కూడా తెలియదు.'

సింగపూర్‌ ఓపెన్‌ నుంచి తప్పుకుంటానని

సింగపూర్‌ ఓపెన్‌ నుంచి తప్పుకుంటానని

బ్యాడ్మింటన్‌లో పోటీ బాగా పెరిగింది. అందుకే ఇప్పుడే పతకం సాధించేయాలి. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌పై కూడా నా దృష్టి ఉంది. ప్రపంచ చాంపియన్‌ అనే హోదా ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. కొన్ని సూపర్‌ సిరీస్‌ టోర్నీల్లోనూ రాణించాల్సి ఉంది' అన్నాడు. మలేసియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ టోర్నీల్లో పాల్గొంటానన్న శ్రీకాంత్‌ సింగపూర్‌ ఓపెన్‌ నుంచి తప్పుకుంటానని తెలిపాడు.

Story first published: Tuesday, June 19, 2018, 16:57 [IST]
Other articles published on Jun 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+